శ్రీ కృష్ణుని దేవాలయం

Lord Krishna: భారతదేశం చారిత్రక దేవాలయాలకు నిలయం. ప్రతీ ఆలయం ఒక పూర్వకథను, ఒక రహస్యాన్ని కలిగి ఉంటుంది. కానీ, కొన్ని ఆలయాలు మన మనస్సును మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అటువంటి ఆధ్యాత్మిక రహస్యాన్ని దాచుకున్న దేవాలయం కర్ణాటకలోని వేణుగోపాల స్వామి ఆలయం.

ఈ ఆలయం ఒకప్పుడు కృష్ణ రాజ సాగర్ ఆనకట్ట నిర్మాణ సమయంలో నీటిలో పూర్తిగా మునిగిపోయింది. 70 సంవత్సరాలు పాటు నీటిలో నిద్రించిన ఈ దేవాలయం, 2011లో తిరిగి భక్తుల కంటికి కనిపించింది. ఇది నిజంగా ఒక అద్భుతమే కదా?

వేణు నాదం వినిపించే దేవాలయం

ఇక్కడ విశేషం ఏంటంటే — ఆలయంలో ఉన్న శ్రీ కృష్ణుని విగ్రహం వేణువు వాయిస్తున్న రూపంలో ఉంది. భక్తుల విశ్వాసం ప్రకారం, నేటికీ ఆయన వేణువు నుంచి మురళీగానం వినిపిస్తుంది. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో నేటికీ శాస్త్రజ్ఞులు తేల్చలేకపోయారు. ఇది ఆలయానికి మిస్టిక్ టచ్‌ను ఇస్తుంది.

ప్రాచీన శిల్పకళకు నిదర్శనం

ఈ ఆలయాన్ని హోయసల రాజవంశం నిర్మించింది. దాదాపు 50 ఎకరాలలో విస్తరించిన ఈ ఆలయ ప్రాంగణంలో యాగశాలలు, వంటగది, ముఖ్య మండపం, గర్భగుడి — అన్నీ అద్భుతంగా నిర్మించబడ్డాయి. శిల్పాల్లో కృష్ణుని లీలలు ఎంతో అందంగా చెక్కబడ్డాయి.

ఎక్కడ ఉంది ఈ ఆలయం?

వేణుగోపాల ఆలయం కర్ణాటక రాష్ట్రం, మండ్య జిల్లాలోని హోసా కన్నంబాడి గ్రామంలో ఉంది. ఇది మైసూరు నుండి 35 కి.మీ దూరంలో, కృష్ణ రాజ సాగర్ ఆనకట్ట సమీపంలో ఉంటుంది.

ఎందుకైనా ఒక్కసారైనా చూడాల్సిన క్షేత్రం!

ఈ ఆలయం చరిత్ర, భక్తి, శిల్పకళ, మిస్టరీ అన్నింటినీ కలగలిపిన పవిత్ర స్థలం. మన గుండెల్లో శ్రీ కృష్ణుడి మురళీ గానం గుప్పిట్లో పట్టుకోవాలంటే — వేణుగోపాల స్వామి ఆలయ దర్శనం తప్పనిసరి!

ఆలయం సాధారణంగా ఉదయం 9:00 AM నుంచి సాయంత్రం 6:00 PM వరకు తెరిచి ఉంటుంది. అయితే వెళ్లే ముందు టైమింగ్స్ కన్ఫర్మ్ చేసుకోవడం మంచిది.

PolitEnt Media

PolitEnt Media

Next Story