సింధూరం పూయడం వెనుక ఉన్న కథ ఇదే

​Lord Hanuman: ఒక రోజు హనుమంతుడు సీతాదేవిని కలుసుకోవడానికి వెళ్లాడు. అప్పుడు సీత తన నుదుటిన సింధూరం పెట్టుకుంటూ కనిపించింది. సీతమ్మ అలా ఎందుకు పెడుతున్నారని హనుమంతుడు అడిగాడు. దానికి సీత, ఇది నా భర్త రాముడి దీర్ఘాయుష్షు కోసం, అతని శ్రేయస్సు కోసం అని చెప్పింది. సీతమ్మ మాటలు విన్న హనుమంతుడు, తన రాముడిపై ఉన్న అమితమైన భక్తితో, తన శరీరం అంతా సింధూరం పూసుకోవడం మొదలు పెట్టాడు. ఒకవేళ తన నుదుట కొద్దిగా సింధూరం పెట్టుకుంటే రాముడి ఆయుష్షు పెరుగుతుంది అనుకుంటే, తన శరీరం మొత్తం పూసుకుంటే రాముడు మరింత చిరంజీవిగా ఉంటాడని హనుమంతుడు భావించాడు. హనుమంతుడి భక్తిని, అమాయకత్వాన్ని చూసి రాముడు చాలా సంతోషించాడు. అప్పుడు రాముడు హనుమంతుడికి ఒక వరం ఇచ్చాడు. ఎవరైతే సింధూరం పూసిన నీ రూపాన్ని పూజిస్తారో, వారికి సుఖసంతోషాలు, అదృష్టం కలుగుతాయి అని చెప్పాడు. అందుకే, ఆంజనేయుడిని సింధూరం పూసి పూజిస్తారు. ఆంజనేయుడికి సింధూరం చాలా ప్రీతిపాత్రమైనది. ఇది ఆయన శ్రీరాముడిపై ఉన్న అచంచలమైన భక్తికి, ప్రేమకి ప్రతీక.

PolitEnt Media

PolitEnt Media

Next Story