అసూయపడతారు

Zodiac Signs: జ్యోతిషశాస్త్రం ప్రకారం, రాశిచక్ర గుర్తులు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. రాశిచక్ర గుర్తులు బాగుంటే, జీవితం బాగుంటుందని నమ్ముతారు. అయితే, కొన్ని రాశుల వారు ఎక్కువగా అసూయపడతారని పండితులు చెబుతారు. ఏ రాశి వారు ఎక్కువగా అసూయ పడతారో ఈ స్టోరీలో తెలుసుకుందా..

అసూయ స్వభావం ఉన్న రాశులు..

వృశ్చికం:

వృశ్చిక రాశివారు ఎక్కువగా ఆధిపత్యం, శక్తిని కోరుకుంటారు. ఈ రాశి అధిపతి యమ కావడంతో, వీరు మోసపూరితంగా, కంట్రోల్ ఉంచుకోవాలనే మనస్తత్వంతో ఉంటారు. అందుకే వీరు కొంత జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.

వృషభం:

వృషభ రాశివారు తమ వస్తువులను, అలాగే తమకు దగ్గరైన వ్యక్తులను ఇతరులు పంచుకోవడం ఇష్టపడరు. వీరు తమ సంబంధాలలో భద్రతను కోరుకుంటారు. అందుకే వీరిలో అసూయ స్వభావం అధికంగా ఉంటుందని చెబుతారు.

కర్కాటకం:

కర్కాటక రాశివారు ఎక్కువగా అసూయపడతారు. అయితే, వీరికి మంచి ప్రతిభ ఉన్నప్పటికీ, దానిని పూర్తిగా గ్రహించలేరని జ్యోతిషశాస్త్రం చెబుతోంది.

సింహం:

సింహ రాశివారు ప్రేమగలవారు తమ చుట్టూ ఉన్న వారి దృష్టి తమపైనే ఉండాలని వీరు కోరుకుంటారు. ఒకవేళ అలా జరగకపోతే అసూయపడే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story