రాశిఫలాలు.....10.08.25 నుండి 16.08.25 వరకు

పండగలు – పర్వదినాలు ...

––––––––––––––––––––––-----

12, మంగళవారం, సంకటహర చతుర్థి

16, శనివారం, శ్రీకృష్ణాష్టమి

–––––––––––––––––––––––––


మేషం... (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. ఆదాయానికి చింతలేకుండా గడుస్తుంది. అయితే మ«ధ్యమధ్యలో ఖర్చులు పెరుగుతాయి. అనుకున్న కార్యాలు కుటుంబసభ్యుల సహాయంతో పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో సందిగ్ధత తొలగుతుంది. తరచూ దూరప్రయాణాలు ఉండవచ్చు. పట్టుదల, సహనంతో ముందుకు సాగి సమస్యల నుంచి గట్టెక్కుతారు. విద్యావకాశాలు దక్కించుకుని విద్యార్థులు ఉత్సాహంగా గడుపుతారు. ఇతరులకు సాయం అందించాలన్న తపన పెరుగుతుంది. స్నేహాలు విస్తరిస్తాయి. శత్రువులను సైతం ఆదరిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలపై కుటుంబంలో చర్చలు జరుపుతారు. శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాలపై మరింత ఆసక్తి కనబరుస్తారు. వృత్తులు, వ్యాపారాలను ఇతరుల ప్రమేయం లేకుండా ప్రశాంతంగా కొనసాగిస్తారు. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు ఉన్నతమైన ఆహ్వానాలు అందుతాయి. 13,14 తేదీల్లో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. కావలసిన వారితో విభేదాలు. లక్ష్మీనారాయణ అష్టకం పఠించండి.


వృషభం... (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, వృగశిర 1,2 పాదాలు)

భవిష్యత్తు బంగారుమయంగా కనిపిస్తుంది. అనుకున్న కార్యక్రమాలను ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయడం విశేషం. సన్నిహితులు, శ్రేయోభిలాషులు మీ అభిప్రాయాలకు మరింత విలువ ఇస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుని ఉత్సాహంగా అడుగులేస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. అనుకున్న రాబడి దక్కడమే కాకుండా దీర్ఘకాలిక రుణబాధలు తొలగే అవకాశాలు. చరస్థిరాస్తుల క్రయవిక్రయాలు సజావుగా సాగుతాయి. సహనంతో శత్రువులకు నచ్చచెప్పి వారిని కూడా ఆకట్టుకుంటారు. కుటుంబసభ్యుల ప్రేమాభిమానాలు పొందుతారు. గతంలో జరిగిన పొరపాట్లు కొన్నింటిని సరిచేసుకుంటారు. ఊహించని ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతి అడుగు అభివృద్ధి్ధపథం వైపు సాగుతుంది. ఏ నిర్ణయమైనా బంధువుల సలహాల మేరకే తీసుకుంటారు. వృత్తులు, వ్యాపారాలలో ఆటుపోట్లు, అవరోధాలు అధిగమిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. 10,11 తేదీల్లో బంధువుల నుండి ఒత్తిడులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఒప్పందాలు వాయిదా. కనకధారా స్తోత్రాలు పఠించండి.


మిథునం... (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

కష్టమైన పనులు సైతం పూర్తి చేసి అసాధ్యం అన్నది లేదని నిరూపిస్తారు. కుటుంబంలో మీపై ప్రేమాభిమానాలు పెరుగుతాయి. పరిచయస్తులు కొంత సహాయసహకారాలు అందిస్తారు. అనుకున్న ఆదాయం సమకూర్చుకోవడంలో ఆటంకాలు తొలగుతాయి. మీ సమర్థత, నైపుణ్యతను కుటుంబసభ్యులు ప్రశంసిస్తారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. నూతన విద్యలు, ఉద్యోగాలు పొందుతారు. కొన్ని జఠిలమైన సమస్యలను సైతం ఓర్పుతో పరిష్కరించకుంటారు. ఆలోచనలు కార్యరూపంలో పెట్టడంలో విజయం సాధిస్తారు. కాంట్రాక్టర్లు అనుకున్న టెండర్లు దక్కించుకుని ఉత్సాహంగా గడుపుతారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు.ఒక సంఘటన మిమ్మల్ని మరింత ఆకట్టుకుంటుంది. ఎంతోకాలంగా ఇబ్బంది కలిగిస్తున్న ఒక వివాదం నుంచి గట్టెక్కుతారు. మీ మనస్సులోని భావాలను నిర్భయంగా వెల్లడిస్తారు. వృత్తులు, వ్యాపారాలలో ప్రతిబంధకాలు, సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. రాజకీయవేత్తలు, కళాకారులు అందిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. 11,12 తేదీల్లో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. కావలసిన వారితో విభేదాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కర్కాటకం... (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)

చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు. ప్రతికూల వ్యక్తులను సైతం అనుకూలురుగా మార్చుకుంటారు. సేవాకార్యక్రమాలు విస్తతం చేస్తారు. చరస్థిరాస్తులను సమకూర్చుకుంటారు. పట్టుదల, నేర్పుతో వివాదాల నుంచి గట్టెక్కుతారు. చిన్ననాటి స్నేహితులు, ఆప్తుల సహాయసహకారాలు అందిస్తారు. గతానుభవాలను నెమరు వేసుకుంటూ ముందుకు సాగుతారు. సడలని ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసి విజయాల బాటపడతారు. వివాహాది వేడుకల నిర్వహణలో భాగస్వాములవుతారు. మీ సహాయం కోసం కొందరు ఆశ్రయిస్తారు. ఆదాయ మార్గాలు మరింత పెరుగుతాయి. పొరపాట్లు సరిదిద్దుకుని నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు దక్కుతాయి. అనుకున్నది సాధించాలనే ధ్యేయంతో ఏ మాత్రం రాజీపడకుండా సాగుతారు. పెద్దల నుంచి తగిన ప్రోత్సాహం అందుకుంటారు. వృత్తులు, వ్యాపారాలలో గందరగోళం నుంచి బయటపడతారు. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు ఊహించని ఆహ్వానాలు అందుతాయి. 13,14 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. వివాదాలకు దూరంగా ఉండండి. కీలక నిర్ణయాలలో మార్పులు. ఆంజనేయ దండకం పఠించండి.


సింహం... (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

ఏ వ్యవహారం చేపట్టినా విజయపథంలో నడిపిస్తారు. ఆప్తులతో మరింత సఖ్యంగా మెలుగుతారు. ఆలోచనలు అమలులో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఒక సమాచారం మరింత ఊరటనిస్తుంది. మీలో దాగిన నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకువస్తారు. పదిమందికీ సాయం చేయాలన్న ఆశయంతో ఒక అడుగు ముందుకు వేస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉండి అప్పులు తీరతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. చరస్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. ఎవరినీ నొప్పించనిరీతిలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తులు, వ్యాపారాలలో మరింత దూసుకువెళతారు.రాజకీయవేత్తలు, కళాకారులు విశేష గుర్తింపు పొందుతారు. 14,15 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. సోదరులు, సోదరీలతో విభేదాలు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.


కన్య.... (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)

ఉత్సాహం, ఉల్లాసంగా గడుపుతారు. ఏ కార్యక్రమమైనా విజయవంతంగా పూర్తి చేసి సత్తా చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి మీకంటూ ప్రత్యేకత చాటుకుంటారు. పరిస్థితులు అనుకూలించి శత్రువులు కూడా స్నేహితులుగా మారతారు. ఒక సంఘటన మీలో మార్పులకు నాందీ పలుకుతుంది. చిరకాల స్వప్నం ఫలిస్తుంది. నిరుద్యోగులు కోరుకున్న అవకాశాలు పొందుతారు. కాంట్రాక్టర్లు గతంలో చేజార్చుకున్న అవకాశాలు తిరిగి దక్కించుకుంటారు. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో అనుకున్న విజయాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక భావాలు మరింత పెంచుకుంటారు. చిన్నచిన్న పొరపాట్లు సరిచేసుకుని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం గతం కంటే మరింత మెరుగుపడుతుంది. వృత్తులు, వ్యాపారాలలో ఒడిదుడుకులు, సమస్యలు తీరి ఊరట చెందుతారు. కళాకారులు, పరిశోధకులు, వైద్యులు లక్ష్యాలు సాధిస్తారు. 10,11 తేదీల్లో మిత్రులతో కలహాలు. కుటుంబంలో సమస్యలు. దూరప్రయాణాలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


తుల... (చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)

ఊహించని విధంగా వ్యవహారాలలో విజయం సాధిస్తారు. రాబడికి ఢోకా లేకుండా గడుపుతారు. మీ పట్టుదల చూసి కుటుంబసభ్యులు ఆశ్చర్యపడతారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. కొన్ని సమస్యల పరిష్కారంలో మరింత చొరవ చూపుతారు. కాంట్రాక్టర్లకు అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. పలుకుబడి పెంచుకుంటూ ముందడుగు వేస్తారు. పట్టుదల, నేర్పుతో వివాదాలు పరిష్కరించకుంటారు. మనోధైర్యం పెరుగుతుంది, సమస్యలను పరిష్కరించకుంటారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు మీలో ఉత్సాహాన్నిస్తాయి. చిత్రవిచిత్ర సంఘటనలు మరింత ఆకట్టుకుంటాయి. మీరు తీసుకునే నిర్ణయాలు అందర్నీ మెప్పిస్తాయి. వాహనాలు, ఆభరణాలు వంటివి సమకూర్చుకుంటారు. వృత్తులు, వ్యాపారాల వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. ముఖ్యంగా వ్యాపారాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాన్వేషణలో విజయం సాధిస్తారు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు తరచూ విదేశీ పర్యటనలు సంభవం. 11,12 తేదీల్లో వృథా వ్యయం. మనశ్శాంతి లోపం. మిత్రులతో విభేదాలు. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.


వ్చశ్చికం... (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

వ్యయప్రయాసలు ఎదురైనా అధిగమిస్తారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకుని నిలబడుతూ పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక విషయాలు గ్రహిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు మరింత పెరుగుతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు పరిష్కారం. ఆర్థిక వ్యవహారాలలో కొంత పురోగతి సాధిస్తారు. సమాజసేవలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మీ నిర్ణయాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. వాహనాలు, స్థలాల కొనుగోలు యత్నాలు సఫలం. నూతన ఉద్యోగలాభం. వ్యాపారాలలో లాభాలు ఆశించినంతగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారుల యత్నాలు కొలిక్కి వస్తాయి. మహిళలకు ధనప్రాప్తి. 12,13 తేదీల్లో కొన్ని వివాదాలు నెలకొని ఇబ్బందిపడతారు. కుటుంబంలో సమస్యలు. మానసిక అశాంతి. శ్రీరామస్తోత్రాలు పఠించండి.


ధనుస్సు... (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)

ఆర్థికపరమైన ఇబ్బందులతో కొంత సతమతమవుతారు. అనుకున్న కార్యక్రమాలు ముందుకు సాగక నిరుత్సాహపడతారు. చిన్ననాటి విషయాలు కొన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యతిరేకులను సైతం వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. కష్టానికి ఫలితం కనిపించక డీలాపడతారు. చిత్రవిచిత్ర సంఘటనలు కొన్ని ఆకట్టుకుంటాయి. మీ సమర్థతను బంధువర్గం గుర్తించకపోవడంతో కలత చెందుతారు. అయితే ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగడం ఉత్తమం. శారీరక రుగ్మతలకు లోనవుతారు. సమస్యలు కొన్ని మీ సహనాన్ని పరీక్షిస్తాయి. తరచూ ప్రయాణాలకు సన్నద్ధమవుతారు. మీ నిర్ణయాలను కుటుంబసభ్యులు వ్యతిరేకిస్తారు. ధార్మిక కార్యక్రమాలు చేపడతారు. వృత్తులు, వ్యాపారాల వారు అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు మరింతగా ఒత్తిడులు తప్పవు. 11,12 తేదీల్లో శుభవార్తలు వింటారు. అదనపు రాబడి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించండి.


మకరం... (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)

కొత్త కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి ఊహించని పిలుపు. ఆలోచనలు అమలులో అవాంతరాలు తొలగుతాయి. చాకచక్యంగా ముందుకు సాగి సమస్యలు అధిగమిస్తారు. కుటుంబంలో కొన్ని వేడుకల నిర్వహణ. భూ వ్యవహారాలలో చిక్కులు వీడి ఉపశమనం పొందుతారు. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ అంచనాలు, వ్యూహాలు ఫలించే సమయం. మీపై ఉన్న ప్రతికూలత తొలగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలు అనుకున్నది సాధిస్తారు. మహిళలకు ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపిస్తాయి. 15,16 తేదీల్లో ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో ఒత్తిడులు, సమస్యలు. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు వాయిదా. సూర్యాష్టకం పఠించండి.


కుంభం... (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

మధ్యమధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురైనా అధిగమిస్తారు. ఏ కార్యక్రమమైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. పరిచయాలు విసృ ్తతమవుతాయి. విద్యార్థులకు కీలక సమాచారం ఊరటనిస్తుంది. ఒక విషయంలో మీ నిర్ణయాన్ని అందరూ హర్షిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలలో వేగం పెరుగుతుంది. ఎంతోకాలంగా వేధిస్తున్న ఆరోగ్యసమస్యలు తీరతాయి. ఆర్థికంగా క్రమేపీ బలపడతారు. రావలసిన బాకీలు అందుతాయి. వ్యాపారస్తులు ఉత్సాహంగా విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణ ఉత్సాహంగా సాగుతుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొత్త అవకాశాలు దక్కవచ్చు. మహిళలకు అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కొన్ని సమస్యలు తీరతాయి. ఋణ విమోచన. 13,14 తేదీల్లో అనుకోని ఖర్చులు. రాబడిల తగ్గుతుంది. ప్రయాణాలలో మార్పులు. అంగారక స్తోత్రం పఠించండి.


మీనం... (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర, రేవతి)

కొత్త వ్యవహారాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో అనురాగం పంచుకుంటారు. ప్రతిభాశాలురుగా గుర్తింపు పొందుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆప్తుల నుంచి శుభవర్తమానాలు రాగలవు. ఒక ఆలోచన మీ జీవితంలో మలుపునకు కారణమవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. ఆర్థిక వ్యవహారాలు మునుపటి కంటే మెరుగుపడతాయి. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో వివాదాలు, సమస్యలు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలకు మరింత ఆశాజనకమైన కాలం. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 14,15 తేదీల్లో వ్యవహారాల్లో స్వల్ప ఆటంకాలు. కుటుంబంలో చికాకులు. మానసిక ఆందోళన. శివానంద లహరి పారాయణ చేయండి.

–––––––––––––––––––––––––––––––––––

Politent News Web 1

Politent News Web 1

Next Story