Tirumala Tirupati Devasthanams: టిటిడి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్‌కు హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన ప్రముఖ దాత శ్రీ కుంచాల మధురాం రెడ్డి రూ.1.11 కోట్ల భారీ విరాళాన్ని అందించారు. సోమవారం హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడును కలిసి దాత ఈ విరాళాన్ని అందజేశారు. గోసంరక్షణ, గోసేవకు పెద్దపీట వేస్తున్న టీటీడీకి అండగా నిలిచి, భారీ విరాళం అందించిన దాత శ్రీ కుంచాల మధురాం రెడ్డిని చైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు అభినందించారు. గోవుల సంరక్షణకు దాతలు అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని, భక్తులు, దాతల సహకారంతో టీటీడీ గోసంరక్షణ కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తుందని తెలిపారు.

మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు హుండీ ద్వారా సమర్పించిన బియ్యాన్ని సెప్టెంబరు 8న ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు. ఈ సందర్భంగా మొత్తం 20 లాట్లలో సుమారు 7,938 కిలోల మిక్సిడ్ రైస్‌ను ఈ-వేలంలో ఉంచనున్నారు. ఈ వేలంలో పాల్గొనదలచిన ఆసక్తి గల వారు సెప్టెంబరు 5వ తేదీ సాయంత్రంలోపు ఆన్‌లైన్‌లో కొనుగోలు పోర్టల్ ద్వారా రూ.50,000 ఈఎండీ (EMD) చెల్లించాల్సి ఉంటుంది. ఈ-వేలానికి సంబంధించిన ఇతర వివరాల కోసం తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ (వేలం) కార్యాలయాన్ని కార్యాలయ వేళల్లో సంప్రదించవచ్చు. ఫోన్: 0877-2264429.

Next Story