Tirumala Tirupati Devasthanams (TTD): సోషల్ మీడియాలో “SCP Developers” పేరుతో కొంతమంది వ్యక్తులు తిరుపతి హైవే లో ప్లాట్లు కొనుగోలు చేస్తే “జీవితాంతం శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తాం” అంటూ ప్రచారం చేస్తున్న రీల్స్‌ను టీటీడీ తీవ్రంగా ఖండిస్తోంది.

ఈ ప్రచారానికి టీటీడీతో ఎలాంటి సంబంధం లేదు. ఇటువంటి హామీలు ఇచ్చే అధికారం ఏ ప్రైవేటు సంస్థకు, వ్యక్తికి లేదని టీటీడీ స్పష్టం చేస్తోంది.

శ్రీవారి దర్శనానికి సంబంధించిన అన్ని విధానాలు, సేవలు, టికెట్లు పూర్తిగా టీటీడీ నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారమే అమలులో ఉంటాయి.

ఎవరైనా వ్యక్తులు లేదా సంస్థలు భక్తులను ఆకర్షించేందుకు టీటీడీ పేరు, శ్రీవారి పేరు, దర్శనాల పేరును ఉపయోగించి తప్పుడు ప్రచారం చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమైన చర్య.

భక్తులు ఇటువంటి తప్పుడు ప్రకటనలు, సోషల్ మీడియా రీల్స్, వాణిజ్య ప్రకటనలను నమ్మి మోసపోవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

శ్రీవారి దర్శనాలకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం టీటీడీ అధికారిక ప్రకటనలు, వెబ్‌సైట్ మరియు అధికారిక సోషల్ మీడియా వేదికలను మాత్రమే విశ్వసించాలని భక్తులను కోరడమైనది. టీటీడీ విజిలెన్స్ అధికారులు సదరు ప్రకటన కొరకు పరి శోధించే క్రమంలో

ఆ సంస్థ తమ వ్యాపార ప్రకటన సోషల్ మీడియా నుండి తీసివేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించడం జరిగింది . అయినప్పటికీ వారిపై చట్టపరమైన తీవ్ర చర్యలు తీసుకోవడం జరుగుతుంది .

టీటీడీ పేరు, శ్రీవారి ప్రతిష్ఠను వ్యాపార ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తూ భక్తులను తప్పుదోవ పట్టించిన సదరు సంస్థపై కఠిన చర్యల నిమిత్తం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరుగుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story