Today Is Guru Purnima: ఇవాళ గురు పౌర్ణమి .. అఖండ విజయాల కోసం ఏ రాశి వారు ఏం చేయాలంటే.?
ఏ రాశి వారు ఏం చేయాలంటే.?

Today Is Guru Purnima: సనాతన ధర్మంలో గురువుకు సాక్షాత్ భగవంతునితో సమానమైన స్థానం ఉంది. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని అత్యంత పవిత్రమైన 'గురు పౌర్ణమి' లేదా 'వ్యాస పూర్ణిమ'గా జరుపుకుంటాం. ఈ ఏడాది జూలై 29న వచ్చిన ఈ గురు పౌర్ణమి మరింత విశిష్టతను సంతరించుకుంది.
ఎన్ని తెలివితేటలున్నా, జీవితంలో ఎదుగుదల లేకసతమతమయ్యే వారికి, విద్య, ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ రోజు చేసే పరిహారాలు అద్భుతమైన ఫలితాలనిస్తాయని పండితులు చెబుతున్నారు. మరి 12 రాశుల వారు ఆ రోజు ఏంచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి: ఈ రాశి వారు గురు పౌర్ణమి రోజు గురువులకు ఎరుపు రంగు దుస్తులు దానం చేయాలి. వినాయకుడిని పూజించి, పేదలకు దానిమ్మ పండ్లు, ఎరుపు రంగు స్వీట్లు పంచిపెడితే చదువులో అడ్డంకులు తొలగుతాయి.
వృషభ రాశి: తెల్లని వస్త్రాలతో గురువును సత్కరించి, పరమేశ్వరునికి ఆవు నెయ్యి, పాలతో అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయి.
మిథున రాశి: గురువుకు స్వయంపాకం, బట్టలు సమర్పించి.. సుబ్రహ్మణ్య స్వామిని పూజించి పసుపు రంగు స్వీట్లు దానం చేయాలి. కర్కాటక రాశి: గురువులకు వెండి వస్తువులు దానం చేసి, చంద్రోదయం తర్వాత శివదర్శనం చేసుకోవడం మంచిది.
సింహ రాశి: గురువులకు ఎరుపు రంగు మిఠాయిలు ఇచ్చి, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయాలి.
కన్య రాశి: ఆకుపచ్చని వస్త్రాలు, పండ్లు దానం చేసి గురువుల పాదాలకు నమస్కరించాలి.
తుల రాశి: లక్ష్మీనారాయణులను పూజించి, గురువును వెంకటేశ్వర స్వామిగా భావించి తెల్లని వస్త్రాలు, పాలు నైవేద్యంగా సమర్పించాలి.
వృశ్చిక రాశి: శివాలయంలో ఆవుపాలతో అభిషేకం చేసి, ఎరుపు రంగు వస్త్రాలు దానం చేస్తే తరచూ వేధించే సమస్యలు పరారవుతాయి.
ధనస్సు రాశి: ఇష్టదైవాన్ని పసుపు రంగు పూలతో పూజించి, గురువులకు పసుపు రంగు బట్టలు పెట్టాలి.
మకర, కుంభ రాశుల వారు: శని దేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి, గురువులకు నీలం లేదా నలుపు రంగు వస్తువులు, నిత్యం ఉపయోగపడే గొడుగు, చెప్పులు వంటివి దానం చేస్తే విశేష ఫలితం ఉంటుంది.ఇక మీన రాశి వారు గోమాతకు గ్రాసం తినిపించి, శివునికి బిల్వదళాలతో పూజ చేసి పులిహార నైవేద్యం సమర్పించాలి.

