సంకటహర చతుర్థి వ్రతం ఇలా చేస్తే

Sankatahara Chaturthi: ఈరోజు గణేశుణ్ని పూజిస్తే సంకటాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. అలాగే మంగళవారానికి అధిపతి అయిన కుమార స్వామి అనుగ్రహం పొందవచ్చని పండితులు చెబుతున్నారు. ఈ శుభదినాన ఇద్దరు శివపుత్రులను కలిపి పూజించి వ్రతం ఆచరిస్తే ఆర్థిక, వివాహ, సంతాన సమస్యలు తొలగిపోతాయని, పిల్లలకు ఏకాగ్రత, జ్ఞానం పెరుగుతుందని సూచిస్తున్నారు.

ఉదయాన్నే స్నానం చేసి, సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. గణేశ్ ఆలయానికి వెళ్లాలి. లేకపోతే ఇంట్లోనే గణపతిని పూజించాలి. నేతి దీపాలు వెలిగించాలి. గరిక, పూలు, మోదకాలు, లడ్డూలను నైవేద్యంగా పెట్టాలి. వినాయక స్తోత్రాలు పఠించాలి. రోజంతా ఉపవాసం ఉంటూ మానసిక స్వచ్ఛత పాటించాలి. సాయంత్రం చంద్రుడిని దర్శించుకుని, పూజ పూర్తి చేయాలి. ఉపవాసం విరమించాలి. భక్తితో చేసే ఈ వ్రతంతో కష్టాలు, అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం.

సంకటహర చతుర్థి వ్రతాన్ని 3, 5, 11, 21 నెలల పాటు ఆచరించవచ్చు. పూజలో భాగంగా ఎరుపు/తెల్లని వస్త్రంలో 3 గుప్పిళ్ల బియ్యం, ఎండు ఖర్జూరాలు, వక్కలు, దక్షిణ ఉంచి కోరిక కోరి ముడుపు కట్టాలి. స్తోత్రాలు, వ్రత కథ పఠించి స్వామికి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. సూర్యాస్తమయం వరకు వినాయకుడిని కదపకూడదు. సాయంత్రం తిరిగి పూజ చేయాలి. ముడుపు బియ్యంతో పొంగలి వండి స్వామికి నివేదించి ప్రసాదంగా తీసుకోవాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story