Today’s Horoscope, November 27, 2026: ఈ రోజు (శుక్రవారం) గ్రహ సంచారం ప్రభావంతో 12 రాశుల వారికి వివిధ రంగాల్లో ఫలితాలు కనిపిస్తాయి. బిజుమళ్ళ బిందుమాధవ శర్మ అందించిన నేటి రాశి ఫలాలు ఇక్కడ వివరంగా పేర్కొనబడ్డాయి. ఆర్థిక విషయాలు, ఉద్యోగం, కుటుంబ సంబంధాలు, ఆరోగ్యం తదితర అంశాలపై జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

మేషం (మార్చి 21 – ఏప్రిల్ 20): తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణమాలు జరుగుతాయి. వేడుకలు, సమావేశాల ఏర్పాట్లలో కొంత అసౌకర్యం కలగవచ్చు. బదిలీలు, మార్పుల విషయంలో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. అగ్రిమెంట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. శ్రీ దుర్గాష్టక పారాయణం శుభప్రదం.

వృషభం (ఏప్రిల్ 21 – మే 20): విద్య, ప్రయాణాలకు అవసరమైన నిధులు సకాలంలో అందుతాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడులకు సంబంధించిన చర్చలు ఫలించకపోవచ్చు. గాయత్రీ అష్టోత్తర శతనామ పారాయణం శుభప్రదం.

మిథునం (మే 21 – జూన్ 21): కొత్త పరిచయాలు లాభిస్తాయి. జనసంబంధాలు విస్తరిస్తాయి. మధ్యాహ్నం నుంచి ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పందాలు, పోటీలకు దూరంగా ఉండటం మేలు. వేడుకల కోసం ఖర్చులు అంచనాలు మించుతాయి. శ్రీ అమ్మవారి ఆలయ దర్శనం శుభప్రదం.

కర్కాటకం (జూన్ 22 – జూలై 23): ఆరోగ్యం మెరుగుపడుతుంది. లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. విందు వినోదాల్లో పరిమితులు పాటించాలి. కొత్త పనుల ప్రారంభం విషయంలో అంచనాలు ఫలించకపోవచ్చు. శ్రీ కనకధారా స్తోత్ర పారాయణం శుభప్రదం.

సింహం (జూలై 24 – ఆగస్టు 23): పొదుపు పథకాలకు సంబంధించి సమాచారం సేకరిస్తారు. ప్రియతములతో ప్రయాణాలకు అనుకూలం. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలకు అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. చిన్నారులు, ప్రియతముల విషయాలు మనస్తాపానికి గురిచేస్తాయి. లలితాపరమేశ్వరిని ఆరాధించండి.

కన్య (ఆగస్టు 24 – సెప్టెంబరు 23): ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. పెట్టుబడుల విషయంలో కీలక నిర్ణయాలకు అనుకూలం కాదు. బృంద కార్యక్రమాల కోసం ఖర్చులు అధికం. రియల్ ఎస్టేట్ రంగంలోని వారు ఆచితూచి వ్యవహరించాలి. శ్రీ గాయత్రీ మాత ఆరాధన శుభప్రదం.

తుల (సెప్టెంబరు 24 – అక్టోబరు 23): పెద్దలతో చర్చలు, సమావేశాలు ఫలిస్తాయి. ఒక సమాచారం కలవరపెడుతుంది. తోబుట్టువుల కారణంగా మాటపడాల్సి వస్తుంది. ఇంటర్వ్యూలలో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. శ్రీ దుర్గాష్టక పారాయణం శుభప్రదం.

వృశ్చికం (అక్టోబరు 24 – నవంబరు 22): కళలు, రక్షణ, టెలివిజన్ రంగాల వారికి ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కొత్త ప్రయోగాలకు దూరంగా ఉండటం మంచిది. వేడుకల కోసం ఖర్చులు అంచనాలు మించుతాయి. శ్రీ దుర్గామాత దర్శనం శుభప్రదం.

ధనుస్సు (నవంబరు 23 – డిసెంబరు 21): ఆర్థిక విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాల కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. ఖర్చులు అధికం. లక్ష్మీదేవిని ఆరాధించండి.

మకరం (డిసెంబరు 22 – జనవరి 20): కొత్త పరిచయాలు ఉల్లాసం కలిగిస్తాయి. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. పందాలు, పోటీల్లో నష్టపోయే అవకాశం ఉంది. కనకధారా స్తోత్ర పారాయణం శుభప్రదం.

కుంభం (జనవరి 21 – ఫిబ్రవరి 19): ఉద్యోగ, వ్యాపారాల్లో అదనపు ఆదాయం అందుకుంటారు. ఫార్మ్, హోటల్, రిటైల్ రంగాల వారికి ఆర్థిక విషయాల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక విషయాల్లో సన్నిహితులు మొహమాటపెట్టే అవకాశం ఉంది. గోమాత ఆరాధన శుభప్రదం.

మీనం (ఫిబ్రవరి 20 – మార్చి 20): ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ఆడిటింగ్, క్రీడలు, అడ్వర్టైజ్‌మెంట్ రంగాల వారు మాటపడాల్సి వస్తుంది. చిన్నారులు, ప్రియతముల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. లలితా సహస్రనామ పారాయణం శుభప్రదం.

ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలని, అనవసర ఖర్చులను నియంత్రించాలని జ్యోతిష్యులు సూచించారు. శుభప్రదమైన పారాయణాలు, ఆరాధనలు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయని పేర్కొన్నారు.

Next Story