Worship Hanuman: రేపు(మే 26) జ్యేష్ఠ మంగళవారం.. హనుమంతుడిని ఇలా పూజిస్తే గ్రహ దోషాలన్నీ పటాపంచల్..
హనుమంతుడిని ఇలా పూజిస్తే గ్రహ దోషాలన్నీ పటాపంచల్..

Worship Hanuman: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జ్యేష్ఠ మాసానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఈ మాసంలో చేసే కొన్ని ప్రత్యేక పూజల వల్ల కలియుగ ప్రత్యక్ష దైవం ఆంజనేయస్వామి అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గ్రహ దోషాలు, శని ప్రభావం, జాతకంలో ఇబ్బందులతో సతమతమవుతున్న వారు.. మే 26న వచ్చే ఈ జ్యేష్ఠ మంగళవారం రోజున హనుమంతుడిని పూజిస్తే సకల కష్టాల నుండి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మరి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా, స్వామి వారిని ఈరోజు ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సిందూర పూజ: మంగళవారం ఉదయాన్నే తలస్నానం చేసి, సమీపంలోని ఆంజనేయస్వామి గుడికి వెళ్లి స్వామివారికి సిందూరాన్ని సమర్పించాలి. హనుమంతునికి సిందూర పూజ చేయడం వల్ల జాతకంలోని కుజ దోషాలు, శని దోషాలు తొలగిపోతాయి.
ఆకు పూజ: స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన తమలపాకులతో పూజ చేయడం లేదా తమలపాకుల మాల సమర్పించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది, అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి.
హనుమాన్ చాలీసా పఠనం: ఇంట్లో కానీ, గుడిలో కానీ దీపం వెలిగించి.. స్వామి వారి ముందు కూర్చొని కనీసం 7 సార్లు హనుమాన్ చాలీసా పఠించాలి. తీవ్రమైన ఇబ్బందులు ఉన్నవారు సుందరకాండలోని కొన్ని శ్లోకాలను పారాయణం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
నైవేద్యం & దానం: ఈ పవిత్రమైన రోజున ఆంజనేయునికి బూందీ లేదా శనగలను నైవేద్యంగా సమర్పించి, పేదలకు అరటిపండ్లు లేదా అన్నదానం చేయడం వల్ల స్వామివారి సంపూర్ణ ఆశీస్సులు లభిస్తాయి.
భయం, అశాంతి, శత్రు బాధలు, ఇంకా ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా.. ఈ జ్యేష్ఠ మంగళవారం నాడు భక్తిశ్రద్ధలతో రామదూతను స్మరిస్తే ఆ హనుమంతుడు మనల్ని అన్ని ఆపదల నుండి రక్షిస్తాడు.

