Triveni Yogas on September 8: జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని రోజులు అత్యంత పవిత్రమైనవి, శక్తివంతమైనవిగా భావిస్తారు. అలాంటి ఒక అరుదైన, అద్భుతమైన రోజే సెప్టెంబర్ 8వ తేదీ.ఈ రోజున ఆకాశంలో ఒకేసారి మూడు అరుదైన యోగాలు రూపుదిద్దుకోబోతున్నాయి. ఈ త్రివేణి యోగాల ప్రభావంతో పరమశివుని ప్రత్యేక అనుగ్రహం కొన్ని రాశుల వారిపై ప్రసరించబోతోంది. ఫలితంగా వారి ఆర్థిక పరిస్థితుల్లో ఊహించని మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు.ముఖ్యంగా, ఈ పవిత్రమైన రోజున శివుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల నవగ్రహ దోషాలు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు.

శివుడి అనుగ్రహం కోసం ఏం చేయాలి?

ఈ రోజు ఉదయాన్నే స్నానం ముగించి, సమీపంలోని శివాలయానికి వెళ్లండి. పరమశివునికి మహాదేవునికి ప్రీతిపాత్రమైన అభిషేకం చేయించండి. ముఖ్యంగా బిల్వపత్రాలు (మారేడు దళాలు), పాలు , నీటితో అభిషేకం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి తొలగిపోతుంది.

అలాగే "ఓం నమః శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు, మీ పనుల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.

ఈ మూడు యోగాల కలయిక వల్ల వ్యాపారంలో లాభాలు రావడం, ఉద్యోగంలో ప్రమోషన్లు లభించడం, రావాల్సిన పాత బాకీలు వసూలు కావడం వంటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి ఇది ఒక రకంగా మహత్తరమైన రోజనే చెప్పాలి.

Next Story