సంస్ధ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు

అన్యమత కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడనే కారణంతో తిరుమల తిరుపతి దేవస్ధానం అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఏ.రాజశేఖరరావుని టీటీడీ సస్పెండ్‌ చేసింది. ఏఈఓ రాజశేఖరబాబుని సస్పెండ్‌ చేసినట్లుగా టీటీడీ ప్రజా సంబంధాల అధికారి ఓ ప్రకటనలో తెలియజేశారు. తిరుపతి జిల్లా పుత్తురులోని తన స్వగ్రామంలో ఏఈఓ రాజశేఖరబాబు ప్రతి ఆదివారం స్థానిక చర్చిల్లో ప్రార్ధనల్లో పాల్గొంటారని టీటీడీకి సమాచారం అందింది. దీంతో తిరుమల తిరుపతి దేవస్ధానం ఉద్యోగిగా రాజశేఖరబాబు టీటీడీ ప్రవర్తనా నియమావళిని పాటించకపోవడంతో పాటు హిందూ ధార్మిక సంస్ధకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగి అయి ఉండి ఆయన బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాడని టీటీడీ గుర్తించింది. రాజశేఖరబాబు వ్యవహారంలో విజిలెన్స్‌ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆదారాలను పరిశీలించిన అనంతరం టీటీడీ నిబంధనల ప్రకారం ఆయనై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు తక్షణమే సస్పెండ్‌ చేసినట్లు టీటీడీ ప్రజాసంబంధాల అధికారి జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Updated On 9 July 2025 9:36 AM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story