టీటీడీ ఈవో విస్తృత తనిఖీలు

TTD EO Inspections: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరితో శనివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా తిరుమలలోని సీఆర్వో కార్యాలయాన్ని ఆధునీకరించేందుకు చేపట్టిన ప్రణాళికలను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. భవిష్యత్తులో యాత్రికుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా అధునాతన సౌకర్యాలతో సీఆర్వోను ఆధునీకరించేందుకు ఉన్న అవకాశాలను అధికారులతో ఆరా తీశారు.

అదేవిధంగా నూతనంగా నిర్మించిన యాత్రికుల వసతి సముదాయం-5 భవనాన్ని పరిశీలించి వెయిటింగ్ హాళ్లు, శుభ్రత, భద్రత ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.ఈ తనిఖీల్లో టీటీడీ చీఫ్ ఇంజనీర్ శ్రీ సత్య నారాయణ, ఈఈ శ్రీ వేణు గోపాల్, డీఈ శ్రీ చంద్ర శేఖర్, డిప్యూటీ ఈవోలు శ్రీ భాస్కర్, శ్రీ సోమన్నారాయణ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీ రాముడు, హెల్త్ ఆఫీసర్ శ్రీ మధుసూదన్, తదితరులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story