సామాన్య భక్తులకు పెద్దపీట.. టిటిడి ఈవో

TTD EO: శ్రీవారి దర్శనార్థం విచ్చేసే సామాన్య భక్తులకు మరింత మెరుగ్గా శ్రీవారి దర్శనం, వసతి, అన్నప్రసాదాలు తదితర సౌకర్యాలు కల్పిస్తామని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం ఉదయం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు తనకు రెండవసారి శ్రీవారి సన్నిధిలో ఈవోగా అవకాశం ఇవ్వడం తన అదృష్టం అన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులు గంటల తరబడి వేచి ఉండి స్వామివారి వాహన సేవలు దర్శించుకున్నారన్నారు. భక్తులకు టిటిడి అందించిన అన్న ప్రసాదాలు, రవాణా, పారిశుద్ధ్యం, భద్రత, శ్రీవారి సేవకుల సేవలు, తదితర సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారని భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యంగా గరుడసేవ నాడు ఉదయం ఎండ తీవ్రత, మధ్యాహ్నం మూడు సార్లు వర్షం పడిందన్నారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడగా, వారి విజ్ఞప్తి మేరకు నాలుగు మాడ వీధిలోని గ్యాలరీలలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా షెల్టర్లు ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కొందరు దళారులు టిటిడి ఉద్యోగులు దర్శనం ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నారని, దర్శనం ఇప్పించకపోగా, తిరిగి డబ్బులు ఇవ్వలేదన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా టిటిడి ఉద్యోగులు, దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story