కష్టాల నుండి విముక్తి కలగాలంటే ఈ తప్పులు అస్సలు చేయకండి..

Tuesday Hanuman Puja: హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం వారంలోని ఏడు రోజులూ ఒక్కో దేవతకు అంకితం చేయబడ్డాయి. అందులో మంగళవారం శ్రీరామ బంటు, కలియుగ దైవం అయిన హనుమంతుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున బజరంగబలిని భక్తిశ్రద్ధలతో కొలిచే భక్తులకు అసాధ్యమైనది ఏదీ ఉండదని పండితులు చెబుతుంటారు.

మంగళవారమే ఎందుకు ప్రత్యేకం?

పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామి మంగళవారం నాడే జన్మించారు. అందుకే ఈ రోజున ఆయనను పూజించడం వల్ల రెట్టింపు ఫలితాలు లభిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం. కుజ దోషం ఉన్నవారు ఈ రోజున హనుమంతుడిని ఆరాధించడం వల్ల జాతకంలోని దోషాలు తొలగిపోయి, జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. భయం, ఆందోళనలతో సతమతమయ్యే వారు హనుమన్నామ స్మరణ చేస్తే మానసిక ధైర్యం లభిస్తుంది.

ఉపవాస నియమాలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

మంగళవారం ఉపవాసం ఉండేవారు కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు..

ఉప్పుకు దూరంగా: ఉపవాసం పాటించే సమయంలో ఉప్పును పూర్తిగా మానుకోవాలి. దీనివల్ల మనస్సుపై నియంత్రణ లభిస్తుంది.

వస్త్రధారణ: పూజ సమయంలో నలుపు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించకూడదు. హనుమంతుడికి ఇష్టమైన ఎరుపు రంగు దుస్తులు ధరించడం వల్ల సానుకూల శక్తి లభిస్తుంది.

మిఠాయిల దానం: మీరు ఇతరులకు ప్రసాదంగా లేదా దానంగా ఇచ్చే మిఠాయిలను మీరు మాత్రం తినకూడదు. ఇది మీ ఉపవాస దీక్షకు భంగం కలిగిస్తుంది.

సాత్విక ఆహారం: ఉపవాస కాలంలో రోజుకు ఒక్కసారి మాత్రమే సాత్విక ఆహారం తీసుకోవాలి. మద్యం, మాంసాహారానికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి.

పరిశుభ్రత మరియు ఏకాగ్రత:

కేవలం శారీరక శుద్ధే కాకుండా, మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ఏకాగ్రతతో హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పఠించడం మంచిది.

లభించే ఫలితాలు:

భక్తిశ్రద్ధలతో మంగళవారం పూజలు చేసే వారికి కార్యసిద్ధి కలుగుతుంది. శని దోషం ఉన్నవారికి కూడా హనుమత్ ఆరాధన ఉపశమనాన్ని ఇస్తుంది. ఆపదల్లో ఉన్నప్పుడు ఆంజనేయుడిని స్మరిస్తే ఆయన అభయ హస్తం తోడుగా ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

PolitEnt Media

PolitEnt Media

Next Story