Vaidhriti Yoga 2026: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారాలు, నక్షత్రాల మార్పులతో పాటు వివిధ గ్రహాల కలయిక వల్ల ఏర్పడే శుభ యోగాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ యోగాలు మానవ జీవితాన్ని, 12 రాశుల వారి జాతకాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలోనే పంచాంగం ప్రకారం జూన్ 4న సాయంత్రం 6:09 గంటలకు ఒక పవిత్రమైన ఖగోళ మార్పు జరగబోతోంది. సూర్య, చంద్రుల కలయిక కారణంగా అత్యంత శక్తివంతమైన వైధృతి యోగం ప్రారంభం కానుంది. జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. ఈ యోగం మొత్తం 12 రాశుల వారిపై ప్రభావం చూపినప్పటికీ, ముఖ్యంగా 4'రాశుల వారికి మాత్రం అఖండమైన విజయాలను, ఊహించని ఆర్థిక పురోగతిని, సరికొత్త ఉద్యోగ అవకాశాలను తీసుకురాబోతోంది. ఆ అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

వైధృతి యోగంతో లాభపడే ఆ 4 అదృష్ట రాశులు ఇవే..

మేష రాశి

మేష రాశి వారికి ఈ సూర్యచంద్రుల కలయిక ఆర్థికంగా అద్భుతమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. మీ పనిలో చూపే కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పాత బాకీలు, ధనం తిరిగి మీ చేతికి అందుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. కుటుంబంలో సంతోషం, ప్రశాంతత నెలకొంటాయి. జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఏ విషయమైనాఈ ఓపికగా ఆలోచిస్తే అంతా శుభమే జరుగుతుంది.

సింహ రాశి

వైధృతి యోగం వల్ల సింహ రాశి వారి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. సమాజంలోనూ, మీరు పనిచేసే చోట మీ గౌరవ మర్యాదలు, హోదా ఒక్కసారిగా పెరుగుతాయి. ముఖ్యంగా రాజకీయాలు లేదా సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి ఉన్నత పదవులు దక్కే అవకాశం ఉంది. భవిష్యత్తులో మీకు భారీ లాభాలను అందించే సరికొత్త వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. ఆరోగ్యం మెరుగుపడి, రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు.

తులా రాశి

ఈ శుభసమయంలో ఏర్పడే రజో గుణ యోగం తులా రాశి వారి జీవితంలో సమతుల్యతను, అమితమైన ఆనందాన్ని నింపుతుంది. నిరుద్యోగులు లేదా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి వారు కోరుకున్న కంపెనీల్లో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ఆఫీసులో కీలకమైన బాధ్యతలు దక్కుతాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడంతో మీ బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది. ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఈ సమయం అఖండమైన భాగ్యాన్ని, అదృష్టాన్ని మోసుకొస్తోంది. ధార్మిక, పూజా కార్యక్రమాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. మీకు ఎంతో ఉపయోగపడే లాభదాయకమైన ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఈ సమయం చాలా ప్లస్ అవుతుంది. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. మీ పాత అనుభవాలు, సీనియర్ల సలహాల వల్ల ఈ కాలంలో పెద్ద ఎత్తున ప్రయోజనం పొందుతారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story