✕
Vaikunta Dwar Darshan at Tirumala: డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు
By PolitEnt MediaPublished on 26 Nov 2025 6:03 PM IST
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు

x
Vaikunta Dwar Darshan at Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది. వైకుంఠ ద్వార దర్శనాల విధి, విధానాలు వివరాలు ఇలా ఉన్నాయి.
ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా దర్శన టోకెన్ల జారీ
వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి, నూతన సంవత్సరం సందర్భంగా మొదటి మూడు రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సర్వ దర్శన టోకెన్లను ఆన్ లైన్ లో కేటాయించనున్నారు. కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండే విధంగా 1+3 విధానంలో టోకెన్లు జారీ చేస్తారు.

PolitEnt Media
Next Story
