Varalakshmi Vratam: వరలక్ష్మి వ్రతం రోజున ఈ పనులు అస్సలు చేయకండి.. లేదంటే దరిద్రం వెంటాడుతుంది!
లేదంటే దరిద్రం వెంటాడుతుంది!

Varalakshmi Vratam: శ్రావణమాసం వచ్చిందంటే చాలు.. గృహిణులందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకునే పండుగ 'వరలక్ష్మి వ్రతం'. వరాలిచ్చే తల్లి వరలక్ష్మీ దేవిని పూజించి, అష్టైశ్వర్యాలను పొందాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. అయితే ఈ పవిత్రమైన రోజున కొన్ని పనులు చేయడం వల్ల ఫలితం దక్కదని శాస్త్రాలు చెబుతున్నాయి.
ముందుగా ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే.. వ్రతం రోజున ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం,మద్యం వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. పూజ సమయంలో బద్ధకం, నిద్రమత్తు, ఆవలింతలు రాకుండా చూసుకోవాలి. మీ మనసు పూర్తిగా అమ్మవారి ధ్యాసలోనే ఉండాలి.
ఇక ఇంట్లో పనుల విషయానికొస్తే.. వరలక్ష్మి వ్రతం రోజున చీపురుతో ఇల్లు ఊడ్చడం, బట్టలు ఉతకడం వంటి పనులు చేయకూడదు. చెత్తను బయటకు పడేయడం వల్ల సంపదను బయటకు పంపినట్లు అవుతుందని అంటారు. అంతేకాదు.. జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం వంటివి కూడా అపశకునంగా భావిస్తారు. ముఖ్యంగా తులసీ దళాలను తెంపడం అస్సలు చేయకూడదు. ఈ రోజు ఇతరులతో గొడవ పడటం, చిరాకు పడటం, కఠినంగా మాట్లాడటం వంటివి మానుకుని.. ప్రశాంతమైన మనసుతో ఉండటం చాలా ముఖ్యం.
మరొక ముఖ్యమైన విషయం.. పూజ గది ఎదుట లేదా ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులను విడిచిపెట్టకండి. ఇది లక్ష్మీదేవికి అవమానకరంగా భావిస్తారు. ఆ అపవిత్రత వల్ల అమ్మవారు ఇంట్లోకి రాకుండానే వెనక్కి వెళ్లిపోతారని పెద్దలు చెబుతారు. గృహిణులు సంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని, పూజా సమయంలో జుట్టు విరబోసుకోకుండా జాగ్రత్త పడాలి.

