Varalakshmi Vratam This Month: ఈ నెలలో వరలక్ష్మి వ్రతం..ఎప్పుడు? ఏం చేయాలి?
ఏం చేయాలి?

Varalakshmi Vratam This Month: హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ పవిత్ర మాసంలో వచ్చే శుక్రవారాల్లో మహిళలు అత్యంత నిష్టతో ఆచరించే అద్భుతమైన వ్రతం 'వరలక్ష్మీ వ్రతం'. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 21వ తేదీన ఈ పవిత్ర వరలక్ష్మీ వ్రతం వచ్చింది.
అసలు ఈ వ్రత విశిష్టత ఏమిటి? అష్టలక్ష్మీ రూపాలైన ఆదిలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, ధనలక్ష్మి, విద్యలక్ష్మిలను పూజించడంతో సమానమైన ఫలం ఈ ఒక్క వరలక్ష్మీ వ్రతం ఆచరించడం ద్వారా లభిస్తుందని నమ్ముతారు. 'వరం' అంటే కోరిన కోర్కెలను ప్రసాదించేది అని అర్థం. అందుకే, భక్తుల కోరికలను కొంగు బంగారంలా తీర్చే తల్లిగా వరమహాలక్ష్మి దేవికి పూజలు చేస్తారు.
ఇక ఈ పూజను ఎలా చేయాలి? ఆ రోజు తెల్లవారుజామునే తలస్మ్రానం చేసి, ఇల్లు శుభ్రం చేసుకుని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. ఒక పీఠంపై బియ్యం పోసి, దానిపై కలశం ఏర్పాటు చేసి, అమ్మవారి ప్రతిమను లేదా ఫోటోను ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో అలంకరించం. షోడశోపచారాలతో అమ్మవారికి పూజ చేసి, తొమ్మిది పోగుల దారాన్ని (తోరం) పూజలో ఉంచి చేతికి కట్టుకుంటారు. అలాగే అమ్మవారికి తొమ్మిది రకాల ప్రసాదాలను నివేదించి, వాయనం ఇస్తారు. కుటుంబసభ్యులంతా సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ప్రతి ఏటా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ పవిత్ర దినాన లక్ష్మీదేవిని స్మరించుకుంటే ఇళ్లలో అష్ట ఐశ్వర్యాలు వెల్లివిరుస్తాయని ప్రతీతి.
- VaralakshmiVratamVaralakshmiVrathamVaralakshmiPujaVaralakshmiVratam2026ShravanaMasamShravanMonthLakshmiPujaGoddessLakshmiMahalakshmiVaralakshmiLakshmiDeviHinduFestivalsHinduTraditionsSanatanaDharmaPujaVidhiVratamDevotionalNewsSpiritualNewsBhaktiTeluguFestivalsTeluguCalendarAndhraPradeshTelanganaFestivalSpecialReligiousNewsLatestDevotionalNewsLatestSpiritualNewsLatestTeluguNewsTeluguNewsBreakingNewsLatestNews

