లేదంటే కష్టాలు తప్పవు

Vastu Alert: హిందూ ధర్మశాస్త్రం ప్రకారం వంటగది కేవలం ఆహారాన్ని వండుకునే చోటు మాత్రమే కాదు, అది సాక్షాత్తూ ఆ అన్నపూర్ణ దేవి కొలువై ఉండే పవిత్ర నిలయం. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, అదృష్టం, ఆర్థిక స్థితిగతులు వంటగదిపైనే ఆధారపడి ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. అయితే తెలియక చేసే కొన్ని పొరపాట్లు ఇంట్లో దారిద్ర్యానికి దారితీయవచ్చు. ముఖ్యంగా వంటగదిలో మూడు వస్తువులు ఎప్పుడూ పూర్తిగా ఖాళీ అవ్వకూడదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు చూద్దాం:

పసుపు

వంటగదిలో పసుపు డబ్బా ఎప్పుడూ నిండుగా ఉండాలి. జ్యోతిషశాస్త్రం ప్రకారం, పసుపు గురు గ్రహానికిప్రతీక. పసుపు పూర్తిగా అయిపోతే గురు దోషం ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల ఇంట్లో శుభకార్యాలకు ఆటంకాలు కలగడం, గౌరవం తగ్గడం, ల్లల భవిష్యత్తుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి, పసుపు అయిపోకముందే కొత్తది తెచ్చి ఉంచుకోవాలి.

ఉప్పు

ఉప్పు లేని రుచి ఎలా ఉండదో, ఉప్పు లేని వంటగదిలో వాస్తు దోషాలు అంతగా పెరుగుతాయి. ఉప్పు పాత్ర ఖాళీగా ఉంటే ఆ ఇంట్లో రాహు, కేతువుల ప్రతికూల ప్రభావం పెరుగుతుందని నమ్ముతారు. ఇది కుటుంబ సభ్యుల మధ్య కలహాలకు, మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. ముఖ్యంగా ఉప్పును ఎవరి వద్ద అప్పుగా తీసుకోకూడదు, ఇవ్వకూడదు. ఉప్పు నిండుగా ఉంటేనే ఆ ఇంట్లో ఆర్థిక స్థిరత్వం ఉంటుంది.

బియ్యం

బియ్యాన్ని మనం అక్షతలు అంటాం, అంటే క్షయం లేనివి అని అర్థం. ఇవి శుక్ర, చంద్ర గ్రహాలకు సంబంధించినవి. బియ్యం డబ్బా ఖాళీ అయితే ఇంట్లోని భౌతిక సుఖాలు, శాంతి కరువవుతాయని వాస్తు చెబుతోంది. శుక్రుడి అనుగ్రహం లేకపోతే సంపద నిలవదు. అందుకే అన్నపూర్ణ దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలంటే, బియ్యం పూర్తిగా అయిపోకముందే కొత్త బియ్యాన్ని నింపుకోవాలి.

వంటగదిలో ఈ మూడు వస్తువులు నిండుగా ఉండటం అంటే కేవలం సరుకులు ఉండటం మాత్రమే కాదు అది ఆ ఇంటి శ్రేయస్సుకి మరియు లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. కాబట్టి గృహిణులు ఈ చిన్న వాస్తు నియమాలను పాటిస్తే ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story