Venus Enters Ashlesha Nakshatra on June 23: జూన్ 23న అశ్లేష నక్షత్రంలోకి శుక్రుడు: మిథునం సహా ఈ 4 రాశుల వారికి కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు తప్పవా?
కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు తప్పవా?

Venus Enters Ashlesha Nakshatra on June 23: హిందూ జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశి మార్పులతో పాటు నక్షత్ర సంచారానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. గ్రహాల నక్షత్ర మార్పులు 12 రాశుల వారి జీవితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. జ్యోతిష్య లెక్కింపుల ప్రకారం.. జూన్ 23న సౌఖ్యాలు, వైభవానికి కారకుడైన శుక్రుడు బుధుడి నక్షత్రమైన అశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు.
ఈ శుక్ర నక్షత్ర పరివర్తనం 12 రాశుల వారిని ప్రభావితం చేసినప్పటికీ, ఈ సమయంలో నాలుగు రాశుల వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, వీరు కొన్ని నష్టాలను మరియు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు. ఆ రాశుల వివరాలు ఇక్కడ చూద్దాం..
మేష రాశి:
మేష రాశి వారికి ఈ శుక్ర సంచారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కొన్ని విషయాల్లో ఆకస్మిక నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో అనవసర ఘర్షణలు లేదా కలహాలు రావచ్చు. తల్లి ఆరోగ్యం విషయంలో ఆందోళన పెరుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండటం అవసరం.
మిథున రాశి:
మిథున రాశి వారికి ఈ నక్షత్ర మార్పు ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా మారే సూచనలు ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మందగించవచ్చు. ఊహించని ఖర్చులు ఇబ్బంది పెడతాయి. అనాలోచితంగా డబ్బు ఖర్చు చేయడం తగ్గించాలి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీ మాట తీరుపై నియంత్రణ కలిగి ఉండటం చాలా ముఖ్యం.
సింహ రాశి:
సింహ రాశి వారికి ఈ కాలంలో ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఖర్చులు అదుపు తప్పడం వల్ల బడ్జెట్ దెబ్బతింటుంది. నిద్రలేమి సమస్యలు, కళ్ల నొప్పులు లేదా కాళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు వేధించవచ్చు. వైవాహిక జీవితంలో కూడా చిన్నపాటి విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో మీ శత్రువుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి.
కన్యా రాశి:
కన్యా రాశి వారికి ఈ సంచారం ఆదాయ మరియు లాభ స్థానాల్లో జరుగుతున్నప్పటికీ, అశ్లేష నక్షత్రాధిపతి బుధుడు కావడం వల్ల ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉండకపోవచ్చు. వ్యాపారస్తులకు ఆశించిన మేర లాభాలు రాకపోవచ్చు. స్నేహితులు లేదా తోబుట్టువులతో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆఫీసు లేదా పని చేసే చోట ఇతరులను గుడ్డిగా నమ్మకూడదు, చతురతతో వ్యవహరించాలి.

