Venus Enters Libra: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభప్రదమైన గ్రహాలలో ఒకటైన శుక్రుడు తన స్వక్షేత్రమైన తులారాశిలోకి ప్రవేశించాడు. సెప్టెంబర్ 2 నుండి నవంబర్ 6 వరకు శుక్రుడు ఇదే రాశిలో సంచరించనున్నాడు. స్వక్షేత్రంలో శుక్రుడి సంచారం వల్ల జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తిమంతమైన పంచ మహాపురుష యోగాలలో ఒకటైన 'మాళవ్య రాజయోగం' ఏర్పడుతోంది. ఈ యోగం వల్ల భౌతిక సుఖాలు, విలాసాలు, సంపద, సమాజంలో కీర్తి ప్రతిష్టలు మరియు దాంపత్య సుఖం రెట్టింపవుతాయి. ముఖ్యంగా ఐదు రాశుల వారికి ఈ కాలం విశేషమైన శుభ ఫలితాలను ఇవ్వనుంది.

ఏయే రాశులకు ఎలాంటి ప్రయోజనాలు దక్కనున్నాయో పరిశీలిస్తే

మిథున రాశి

సంబంధాల పరంగా ఈ యోగం మిథున రాశి వారికి అద్భుతంగా కలిసివస్తుంది. జీవిత భాగస్వామితో లేదా ప్రేమ భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు పెరగడం వల్ల తొలుత పనిభారం అనిపించినప్పటికీ, అంతిమంగా అది కెరీర్ పురోగతికి బాటలు వేస్తుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, నూతన భాగస్వామ్యాలు, క్లయింట్ల ద్వారా లాభాలు సమకూరతాయి.

కన్యా రాశి

కన్యారాశి వారికి సరికొత్త ఆర్థిక వనరులు ఏర్పడతాయి. అనవసర ఖర్చులు తగ్గి పొదుపు పెరుగుతుంది. నూతన గృహం లేదా వాహనం కొనుగోలు చేయాలనుకునే వారి కలలు నెరవేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి.

తులా రాశి

శుక్రుడు లగ్నంలోనే సంచరిస్తుండటంతో తులా రాశి జాతకులకు అత్యధిక ప్రయోజనాలు లభిస్తాయి. వ్యక్తిత్వంలో ఆకర్షణ, తేజస్సు పెరుగుతాయి. ఉద్యోగం, వ్యాపారం ఏదైనా సరే ఆశించిన లాభాలు అందుకుంటారు. అవివాహితులకు వివాహ యోగం కుదురుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి భారీగా రాబడులు వచ్చే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నతాధికారులు మరియు సహోద్యోగుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు ఊపందుకుని వేగంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులు, భాగస్వామితో ఆనందంగా గడపడం వల్ల ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఊహించని ఆర్థిక లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి.

మీన రాశి

మీన రాశి వారికి కెరీర్‌లో సరికొత్త అవకాశాలు తలుపు తడతాయి. పనిని నిబద్ధతతో, సమయానికి పూర్తి చేస్తే ఉన్నత ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెడితే మంచి విజయాలు సాధిస్తారు. ప్రతికూల ఆలోచనలు, అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా, ఉల్లాసంగా సాగుతుంది.

Next Story