Want Peace of Mind: మనశ్శాంతి కావాలా? రోజూ ఈ 3 మంత్రాలను పఠిస్తే మీ జీవితం మారిపోతుంది!
రోజూ ఈ 3 మంత్రాలను పఠిస్తే మీ జీవితం మారిపోతుంది!

Want Peace of Mind: ఆధునిక కాలంలో ఒత్తిడి అనేది మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. ఆఫీసు పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఆరోగ్య సమస్యలు.. ఇలా కారణం ఏదైనా సరే, చిన్న విషయానికే చాలామంది ఆందోళన చెందుతున్నారు. అసలు విషయం ఏమీ లేకపోయినా మనసులో ఏదో తెలియని గాబరా, టెన్షన్ మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనకు అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది 'మనశ్శాంతి'. అందుకే మన పెద్దలు ఆ కాలంలోనే ఒక అద్భుతమైన మార్గాన్ని చూపారు. అదే ధ్యానం మరియు దైవ ప్రార్థన. రోజూ కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని పూజ చేయడం, శక్తివంతమైన మంత్రాలను పఠించడం వల్ల మనసులోని ఆందోళనలు తొలగిపోయి, అద్భుతమైన ప్రశాంతత ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు.
ప్రస్తుతం మారుతున్న కాలంతో పాటు జనాలు మళ్ళీ ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారు. ఏ మతానికి చెందిన వారైనా, వారి మతానుసారంగా రోజులో కొంత సమయాన్ని ధ్యానానికి కేటాయిస్తున్నారు. తమ ఇష్ట దైవాన్ని లేదా కుల దైవాన్ని స్మరించుకుంటూ, మనసును కేంద్రీకరించడం వల్ల ఒత్తిడి మటుమాయం అవుతుంది. ముఖ్యంగా హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం, కొన్ని మంత్రాలకు అపారమైన శక్తి ఉంది. ఆ మంత్రాల ప్రకంపనలు మన మెదడుపై సానుకూల ప్రభావం చూపుతాయి. పండితుల అభిప్రాయం ప్రకారం.. ప్రతిరోజూ గణేశ మంత్రం, గాయత్రి మంత్రం, మహా మృత్యుంజయ మంత్రాలను పఠించడం వల్ల జీవితంలో ఊహించని మంచి మార్పులు వస్తాయి.
గణేశ మంత్రం: ఇది పనుల్లో వచ్చే ఆటంకాలను తొలగించి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
గాయత్రి మంత్రం: బుద్ధిని ప్రేరేపించి, ఏకాగ్రతను పెంపొందిస్తుంది.
మహా మృత్యుంజయ మంత్రం: అకాల భయాన్ని పోగొట్టి, మానసిక ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.
కేవలం 10 నిమిషాల ధ్యానం మీ రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. నెగటివ్ ఆలోచనలను దూరం చేసి, పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది.

