Strengthen Jupiter During Shravan: శ్రావణంలో గురు బల పెరగాలా? కష్టాలు తీరి అదృష్టం వరించే శక్తివంతమైన ఆధ్యాత్మిక పరిహారాలు..
ఆధ్యాత్మిక పరిహారాలు..

Strengthen Jupiter During Shravan: శ్రావణ మాసం అత్యంత పవిత్రమైన సమయం. శివకేశవుల అనుగ్రహం పొందేందుకు ఈ మాసం ఎంతో విశిష్టమైనదని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. జాతకంలో గురు గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు, వృత్తి ఉద్యోగాల్లో అడ్డంకులు, మానసిక అశాంతి ఎదురవుతాయి. అటువంటి వారు శ్రావణ మాసంలో కొన్ని సులభమైన, శక్తివంతమైన పరిహారాలు పాటించడం వల్ల గురు బలం పెరిగి శుభ ఫలితాలు లభిస్తాయి.
గురు గ్రహ బలాన్ని పెంచే ముఖ్య పరిహారాలు
శివారాధన - పసుపు తిలకం:
శ్రావణ మాసంలోని ప్రతి సోమవారం పరమశివుడికి ప్రీతిపాత్రమైన బిల్వపత్రాలు, పుష్పాలతో విశేష పూజలు నిర్వహించాలి. పూజ ముగిసిన తర్వాత నుదుట పసుపు లేదా కుంకుమపువ్వుతో తయారు చేసిన తిలకాన్ని ధరించాలి. ఇది శరీరంలో సానుకూల శక్తిని నింపి, జీవితంలోని ఆటంకాలను తొలగిస్తుంది.
శ్రీ మహావిష్ణువు పూజ
ప్రతిరోజూ ఉదయాన్నే శుచిగా స్నానమాచరించి విష్ణుమూర్తిని ఆరాధించాలి. స్వామివారికి పాలాభిషేకం చేసి, తులసి దళాలు, కేసరి పూలు, తీపి వంటకాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల గురు దేవుని అనుగ్రహం త్వరగా లభిస్తుంది.
పసుపు వస్తువుల దానం - ఆలయ దర్శనం:
శ్రావణ మాసంలో పసుపు రంగు వస్త్రాలు, శనగలు, పసుపు ధాన్యాలు లేదా పండ్లను దానం చేయడం ఉత్తమం. ప్రతి సోమవారం, శుక్రవారాల్లో ఆలయాలను దర్శించి దీపారాధన చేయడం, పేదలకు సహాయం చేయడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయి.
పెద్దల ఆశీర్వాదం:
గురుడు జ్ఞానానికి, గౌరవానికి ప్రతీక. తల్లిదండ్రులు, గురువులు, పెద్దల పట్ల గౌరవంతో వ్యవహరిస్తూ వారి ఆశీస్సులు తీసుకోవడం వల్ల జాతకంలో బృహస్పతి స్థానం మరింత బలపడుతుంది.
శ్రావణ మాసంలో భక్తిశ్రద్ధలతో ఈ నియమాలను ఆచరిస్తే కష్టాలన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలు, ఆర్థికాభివృద్ధి, కుటుంబంలో శాంతి లభిస్తాయని విశ్వాసం.

