Wearing a Tulasi Mala: తులసి మాల ధరిస్తున్నారా? ఈ నియమాలు తెలియకపోతే పుణ్యం కంటే పాపమే ఎక్కువ..
ఈ నియమాలు తెలియకపోతే పుణ్యం కంటే పాపమే ఎక్కువ..

Wearing a Tulasi Mala: శ్రీమహావిష్ణువుకు, కృష్ణుడికి అత్యంత ప్రీతికరమైనది తులసి. తులసి లేనిదే విష్ణువు నైవేద్యాన్ని స్వీకరించడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే విష్ణు భక్తులు తులసి మాల ధరించడాన్ని ఒక పవిత్ర కార్యంగా భావిస్తారు. కానీ ఈ మాల ధరించే వారు ఆహార విహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
తులసి మాల ధరించేవారు పాటించాల్సిన నియమాలు:
శాకాహారం తప్పనిసరి: తులసి మాల ధరించిన వ్యక్తి ఖచ్చితంగా మాంసాహారం, చేపలకు దూరంగా ఉండాలి. అంతేకాకుండా తామసిక ఆహారాలైన ఉల్లిపాయ, వెల్లుల్లిని కూడా తీసుకోకూడదని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.
నిత్య జపం: ఈ మాలను ధరించిన వారు ప్రతిరోజూ దైవ నామ స్మరణ లేదా జపం చేయాలి. ఇది విష్ణువు అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉండేలా చేస్తుంది.
శుద్ధి చేయడం: మార్కెట్ నుండి తెచ్చిన తులసి మాలను నేరుగా ధరించకూడదు. ముందుగా దానిని గంగాజలం లేదా పవిత్రమైన నీటితో శుద్ధి చేసి, ఆరబెట్టిన తర్వాతే ధరించాలి.
తీసివేయకూడదు: ఒకసారి సంకల్పం చెప్పుకుని మాలను ధరించిన తర్వాత, దానిని పదే పదే తీసి పక్కన పెట్టకూడదు. అది నిరంతరం శరీరాన్ని తాకుతూ ఉండాలి.
తులసి మాల వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు
మనశ్శాంతి: తులసి మాల ధరించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనలు తగ్గి ఆత్మ శుద్ధి జరుగుతుంది.
వాస్తు దోష నివారణ: ఇంట్లో తులసి మొక్క ఉండటం, మెడలో తులసి మాల ధరించడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి వాస్తు దోషాలు హరిస్తాయని నమ్మకం.
వైకుంఠ ప్రాప్తి: పురాణాల ప్రకారం, తులసి మాల ధరించిన వ్యక్తిని విష్ణువు తన రక్షణలోకి తీసుకుంటాడు. అలాంటి వారు మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం.
ఆరోగ్య రక్షణ: తులసిలోని ఔషధ గుణాలు శరీరంలోని విద్యుత్ ప్రవాహాన్ని క్రమబద్ధీకరిస్తాయి మరియు అనేక వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి.
తులసి మాల ధరించడం అనేది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ. నియమాలను పాటిస్తూ మాలను ధరిస్తే సకల శుభాలు కలుగుతాయి.

