చిహ్నాలేంటి.?

Every Sumangali Must Wear: సుమంగళి' అనే పదంలో 'సు' (Su) అంటే శుభకరమైన లేదా మంచి, మంగళం' (Mangalam) అంటే శుభం లేదా సౌభాగ్యం. హిందూ సంస్కృతిలో, భర్త జీవించి ఉన్న వివాహిత స్త్రీని 'సుమంగళి' అని పిలుస్తారు. ఈ పదం స్త్రీ యొక్క వివాహిత స్థితిని,ఆమె అనుభవిస్తున్న సౌభాగ్యాన్ని సూచిస్తుంది. హిందూ సంప్రదాయంలో, వివాహిత స్త్రీ (సుమంగళి) సౌభాగ్యాన్ని, పవిత్రతను సూచించే ముఖ్యమైన చిహ్నాలను పంచ మంగళ్యాలుగా పేర్కొంటారు.

పంచ మంగళ్యాలు

మంగళ సూత్రం : ఇది అన్నింటికంటే ముఖ్యమైనది. భర్త దీర్ఘాయుష్షు కోసం, అత్తమామలకు గౌరవ సూచకంగా ధరించే ఈ పవిత్రమైన గొలుసులో పసుపు తాడు లేదా నల్ల పూసలు (నల్లపూసలు) ఉంటాయి.

కుంకుమ / సింధూరం : నుదుటిన పాపిడి మధ్యలో ధరించే ఎరుపు రంగు కుంకుమ, స్త్రీ వివాహిత స్థితిని, శక్తిని సూచిస్తుంది.

గాజులు: ముఖ్యంగా ఎరుపు, ఆకుపచ్చ వంటి శుభప్రదమైన రంగుల గాజులు ధరించడం సౌభాగ్యానికి, సంతోషానికి చిహ్నం.

పసుపు , రంగు వస్త్రం: శరీరంపై పసుపు పూసుకోవడం లేదా పసుపు రంగు అంచు ఉన్న చీరలు ధరించడం పవిత్రతకు, శుభానికి సంకేతం.

మెట్టెలు : కాళ్ళ వేళ్లకు ధరించే వెండి మెట్టెలు వివాహ బంధానికి, సంతాన సౌభాగ్యానికి చిహ్నాలుగా భావిస్తారు.

ఈ ఐదు చిహ్నాలు ఒక సుమంగళి జీవితంలో శక్తి, పవిత్రత, సౌభాగ్యం, ప్రేమ , రక్షణ అనే ఐదు ముఖ్య సూత్రాలను ప్రతిబింబిస్తాయని నమ్ముతారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story