గణేశ నిమజ్జనంపై పండితులు ఏమంటున్నారంటే..?

Ganesh Immersion: ఈ సంవత్సరం వినాయక చతుర్థి సందర్భంగా రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉన్నందున నిమజ్జనంపై భక్తుల్లో నెలకొన్న గందరగోళాన్ని పండితులు నివృత్తి చేస్తున్నారు. గణపతిని 10 రోజుల కంటే ముందే నిమజ్జనం చేయాలని సూచించారు. భక్తులు వారి సౌలభ్యం మేరకు మూడు, ఐదు లేదా ఏడు రోజులకు గణేశుడిని నిమజ్జనం చేయవచ్చు. నిమజ్జనానికి ముందు షోడశోపాచార పూజ చేయాలని పండితులు సూచించారు. పూజలో మోదక్, స్వీట్లు, ఇతర పవిత్ర వస్తువులను సమర్పించడం ముఖ్యమని తెలిపారు. అలాగే ప్రతిరోజూ త్రికాల పూజ, భజన, గణపతి స్తోత్రం, మంత్ర జపం, 21 గరికలను సమర్పించడం శుభప్రదమని పేర్కొన్నారు.

నిమజ్జనానికి అనువైన తేదీలు

మూడు రోజుల తర్వాత: ఆగస్టు 29న

ఐదు రోజుల తర్వాత: ఆగస్టు 31న

ఏడు రోజుల తర్వాత: సెప్టెంబర్ 2న

తొమ్మిది రోజుల తర్వాత : సెప్టెంబర్ 4న

చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదీ తర్వాత నిమజ్జనం చేయకూడదని తెలిపారు. గణేశుడిని గౌరవంగా నిమజ్జనం చేయడం చాలా ముఖ్యమని నొక్కి చెప్పారు. ఓం గ గణపతయే నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని సూచించారు. ఈ సూచనలు భక్తులకు నిమజ్జనం విషయంలో ఉన్న సందేహాలను తొలగించడానికి ఉపకరిస్తాయని భావిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story