Lord Shiva Appears in Your Dream: కలలో శివుడు కనిపిస్తే ఏమవుతుంది.?
శివుడు కనిపిస్తే ఏమవుతుంది.?

Lord Shiva Appears in Your Dream: హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం,స్వప్న శాస్త్రం (Dream Science) ప్రకారం కలలో శివుడు కనిపించడం అత్యంత శుభసూచకంగా భావిస్తారు. శివుడు మంగళకరుడు, కాబట్టి ఆయన దర్శనం శుభ ఫలితాలనే ఇస్తుందని భక్తుల నమ్మకం.
కలలో శివుడు ఏ రూపంలో కనిపించాడనే దాన్ని బట్టి రకరకాల అర్థాలు ఉన్నాయి
1. శివలింగం కనిపిస్తే
కలలో శివలింగం కనిపిస్తే మీ జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని అర్థం.ఇది విజయానికి సంకేతం.పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఇది మానసిక ప్రశాంతతకు , ఆధ్యాత్మిక ఎదుగుదలకు నిదర్శనం.
2. శివ పార్వతులు కలిసి కనిపిస్తే
పార్వతీ పరమేశ్వరులు కలలో కనిపిస్తే అది దాంపత్య సౌఖ్యానికి సూచన.పెళ్లి కాని వారికి త్వరలో వివాహం జరుగుతుందని, పెళ్ళైన వారికి భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుందని దీని అర్థం. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి.
3. తాండవం చేస్తున్న శివుడు
శివుడు తాండవం చేస్తున్నట్లు కనిపిస్తే, అది మీలో ఉన్న కోపాన్ని లేదా ఉద్వేగాన్ని నియంత్రించుకోవాలని సూచిస్తుంది. అలాగే, పాత సమస్యలు అంతమై, కొత్త జీవితం ప్రారంభం కాబోతుందని కూడా కొందరు పండితులు చెబుతుంటారు.
4. శివాలయం కనిపిస్తే
కలలో దేవాలయం కనిపిస్తే మీరు మానసిక శాంతిని కోరుకుంటున్నారని లేదా మీకున్న అనారోగ్య సమస్యలు త్వరలో నయం కాబోతున్నాయని అర్థం.
5. శివుని ఆభరణాలు (పాము, త్రిశూలం, డమరుకం)
పాము: కలలో పాము కనిపిస్తే అది జ్ఞానానికి, ఆర్థిక లాభానికి సూచన.
త్రిశూలం: మీ సమస్యలన్నీ త్వరలో పరిష్కారం కాబోతున్నాయని అర్థం.
డమరుకం: శుభవార్తలు వినబోతున్నారని సంకేతం.

