Seeing a Peacock in a Dream Mean: కలలో నెమలి కనిపిస్తే ఏమవుతుంది? అదృష్టమా లేక హెచ్చరికా? స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది..
అదృష్టమా లేక హెచ్చరికా? స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది..

Seeing a Peacock in a Dream Mean: నెమలిని శ్రేయస్సు, ఆధ్యాత్మికత, ఐశ్వర్యానికి చిహ్నంగా భావిస్తారు. మీ కలలో నెమలి ఏ స్థితిలో కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అదృష్టాన్ని తెచ్చే శుభ శకునాలు
జత నెమళ్లు: మీరు ఇంకా వివాహం కాకుండా ఉండి, కలలో జంట నెమళ్లను చూస్తే మీకు త్వరలోనే కళ్యాణ ఘడియలు దగ్గరపడ్డాయని అర్థం. ఇది స్థిరమైన, సంతోషకరమైన వైవాహిక జీవితానికి సంకేతం.
తెల్ల నెమలి: అత్యంత అరుదుగా కనిపించే తెల్ల నెమలి కలలోకి వస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉన్నట్లు లెక్క. దీనివల్ల ఆకస్మిక ధనలాభం, ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కలుగుతాయి.
కృష్ణుడి శిరస్సుపై నెమలి ఈక:
శ్రీకృష్ణుడి తలపైన నెమలి ఈక ఉన్నట్లు కల వస్తే, మీ జీవితంలోని గ్రహ దోషాలు తొలగిపోయి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి.
అప్రమత్తంగా ఉండాల్సిన సంకేతాలు
కలలో నెమలి కనిపించిన ప్రతిసారీ అది మంచి ఫలితాలనే ఇవ్వదు. కొన్ని సందర్భాల్లో ఇది రాబోయే ఇబ్బందులను కూడా సూచిస్తుంది..
చనిపోయిన నెమలి: కలలో మరణించిన నెమలి కనిపిస్తే అది వృత్తిపరమైన ఆటంకాలకు లేదా ఆర్థిక నష్టాలకు సూచన. ఇలాంటి కల వస్తే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
నెమళ్ల పోరాటం: రెండు నెమళ్లు కొట్టుకుంటున్నట్లు కల వస్తే, మీ వ్యక్తిగత సంబంధాలలో లేదా కుటుంబ సభ్యులతో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. ఇది మీలోని అహకారాన్ని కూడా సూచిస్తుంది.
నీరసంగా ఉన్న నెమలి: నెమలి నాట్యం చేయకుండా లేదా ఎగరకుండా నేలపై దిగాలుగా కూర్చుని ఉంటే, మీ పనుల్లో జాప్యం జరుగుతుందని లేదా మంచి అవకాశాలను మీరు జారవిడుచుకుంటున్నారని అర్థం.
నల్ల నెమలి: కలలో నల్ల నెమలి కనిపిస్తే అది మానసిక ఆందోళనను లేదా పరువు నష్టాన్ని సూచిస్తుంది.

