తలకు నూనె రాసుకుంటే ఏమవుతుంది..?

you apply oil to your hair before visiting a temple: హిందూ సంస్కృతిలో దేవాలయ దర్శనం అత్యంత పవిత్రమైన అనుభూతి. భగవంతుని కృప పొందాలంటే, మన భావాలు ఎంత ముఖ్యమో, కొన్ని ఆచార వ్యవహారాలను పాటించడం కూడా అంతే ముఖ్యం. ఆలయానికి వెళ్ళేటప్పుడు భక్తులు పాటించాల్సిన కొన్ని ముఖ్య విషయాలపై పండితులు మార్గదర్శకత్వం అందించారు.

స్నానం తర్వాత నూనె వాడకంపై..

సాధారణంగా ఆలయానికి వెళ్ళే ముందు భక్తులు పూర్తి శుద్ధిని పాటిస్తారు. స్నానం చేసి, పరిశుభ్రమైన దుస్తులు ధరించి, మనసును భగవంతునిపై లగ్నం చేస్తారు. అయితే ఈ పవిత్రమైన సన్నాహాల్లో భాగంగా స్నానం చేసిన వెంటనే తలకు నూనె రాసుకోవడం మంచిది కాదని నిపునులు స్పష్టం చేశారు.

నూనె వాడకం వల్ల కలిగే ప్రభావం

ఆలయానికి వెళ్ళే ముందు తలకు నూనె రాసుకుంటే, భక్తులు భగవంతుని సన్నిధిలో పెట్టుకున్న సంకల్పాలు లేదా కోరికలు పూర్తిగా నెరవేరకపోవచ్చని తెలిపారు. అందుకే, తలకు నూనె రాసుకున్న తర్వాత ఆలయానికి వెళ్ళడం శుభకరం కాదని సలహా ఇచ్చారు. ఆలయ దర్శనం పూర్తి చేసుకుని, తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత తలకు నూనె రాసుకోవడం మరింత మంచిదని పండితులు సూచించారు.

సనాతన ధర్మాన్ని పాటించడం ముఖ్యం

భక్తులు తమ నమ్మకాలకు అనుగుణంగా, సనాతన ధర్మ పద్ధతులను అనుసరించడం ఎంతో అవసరం. "సనాతన నో నిత్య నూతన" అనే సూత్రాన్ని గుర్తుంచుకోవాలని, అంటే మన సనాతన సంస్కృతి ఎల్లప్పుడూ సందర్భోచితంగా, నూతనంగా ఉంటుందని పండితులు తెలిపారు. ఈ నియమాలను పాటించడం వల్ల భక్తులకు అదృష్టం చేకూరుతుందని తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story