Black Cat: నల్ల పిల్లి ఎదురొస్తే ఏమవుతుంది..? తప్పక తెలుసుకోండి..
తప్పక తెలుసుకోండి..

Black Cat: నల్ల పిల్లి చెడుకు సంకేతంగా చెబుతారు. ప్రయాణంలో నల్ల పిల్లి ఎదురుగా వస్తే భయపడాల్సిన అవసరం లేదని, దానికి బదులు సంతోషించాలని పండితులు సూచించారు.
చాలా మంది ప్రయాణం చేస్తున్నప్పుడు పిల్లి, ముఖ్యంగా ఎడమ నుండి కుడికి దారి దాటితే, దాన్ని అశుభంగా భావించి ప్రయాణాన్ని వాయిదా వేస్తారు. శకున శాస్త్రం ప్రకారంనల్ల పిల్లిని చూడటం లేదా అది దారి దాటడం గొప్ప శుభ సంకేతం అని శకున శాస్త్రం చెబుతుందని వివరించారు. నల్ల పిల్లి ఎదురుగా వస్తే అది అదృష్టాన్ని తెస్తుంది. మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం.
నల్ల పిల్లి కనిపిస్తే కలిగే ప్రయోజనాలు:
గురూజీ చెప్పిన దాని ప్రకారం.. నల్ల పిల్లి కనిపించిన తర్వాత కొన్ని రోజుల్లోనే కింది శుభ ఫలితాలు కనిపిస్తాయి:
ఆర్థిక పరిస్థితి మెరుగుదల: చాలా కాలంగా రాకుండా ఆగిపోయిన డబ్బు, పెండింగ్‌లో ఉన్న బిల్లులు లేదా జీతం బకాయిలు వంటివి త్వరలో అందుతాయి. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.
అదృష్టం: నల్ల పిల్లి కనిపించిన 21 రోజుల్లో అదృష్టం రెట్టింపు అవుతుందని నమ్ముతారు.
ఇతర సానుకూలతలు: ఆరోగ్యం మెరుగుపడుతుంది, శత్రువులు స్నేహితులుగా మారతారు, ఉద్యోగంలో బదిలీ లేదా పదోన్నతి లభించవచ్చు. కొందరికి కొత్త ఇల్లు, కొత్త వాహనం లేదా మంచి ప్రయాణ యోగం కూడా కలుగవచ్చు.
ఏం చేయాలి?
నల్ల పిల్లి కనిపించినప్పుడు, ప్రయాణాన్ని ఆపకుండా వెంటనే కొనసాగించాలి లేదా పనులను మొదలు పెట్టాలి. ఇలాంటి శుభ సంకేతం కనిపించినప్పుడు..ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం కృష్ణాయ నమః అనే మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే అదృష్టం త్వరగా కలిసి వస్తుందని పండితులు చెప్పారు. ఈ నమ్మకాలు మన జీవితంలో సానుకూల ఆలోచనలను పెంచుతాయని వివరించారు.
