ఏం జరుగుతుంది?

Skip Breakfast: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారా? అయితే కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. చాలా మంది బరువు తగ్గే ప్రయత్నంలో లేదా సమయం లేకపోవడం వల్ల అల్పాహారాన్ని దాటవేస్తుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. రాత్రి నిద్ర తర్వాత మన శరీరానికి శక్తి అవసరం. బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే రోజు మొత్తం నీరసంగా, అలసటగా అనిపిస్తుంది. శరీరంలో చక్కెర స్థాయిలు పడిపోవడం వల్ల ఇది జరుగుతుంది. బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే తరువాత భోజనంలో ఎక్కువగా తినే అవకాశం ఉంది. ఉదయం తక్కువగా తినడం వల్ల మధ్యాహ్నం ఎక్కువ ఆకలి వేసి, అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు తినేలా చేస్తుంది. దీనివల్ల బరువు పెరగవచ్చు. అల్పాహారం మానేస్తే చిరాకు, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు రావచ్చు. మెదడు సరిగా పనిచేయడానికి గ్లూకోజ్ అవసరం. ఇది బ్రేక్‌ఫాస్ట్ ద్వారా లభిస్తుంది. బ్రేక్‌ఫాస్ట్ లో మనం పాలు, పండ్లు, గుడ్లు, ఓట్స్ వంటి పోషకాలను తీసుకుంటాం. వీటిని మానేస్తే శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. క్రమం తప్పకుండా బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story