దాని మూలాలు ఏంటి?

‘Mantra’: ‘మంత్రం’ అనే పదం సంస్కృత ధాతువు ‘మన్’(ఆలోచించడం) నుంచి పుట్టింది. అంటే మనసును రక్షించేదని అర్థం. ఇవి ప్రాచీన వేద కాలంలో రుషుల ద్వారా ఉద్భవించాయి. మంత్రం అంటే పదమే కాదు. పవిత్ర ధ్వని శక్తి. రుగ్వేదం, సామవేదం, యజుర్వేదం వంటి గ్రంథాల నుంచి తీసుకున్నారు. మంత్రాలలో అర్థం కంటే కూడా ఆ శబ్దాల వల్ల కలిగే ప్రకంపనలే అత్యంత ముఖ్యమైనవి. ఇవి మనల్ని ఆధ్యాత్మికంగా, మానసిక స్థాయిలో ఉన్నత స్థితికి చేరుస్తాయి.

మంత్రాలను పఠించడాన్ని ‘జపం’ అంటారు. అమరకోశం ప్రకారం మంత్రాలు 2 రకాలు. మంత్రాలను గట్టిగా పఠించడం, పెదవులు కదుపుతూ నెమ్మదిగా పలకడం, మనసులోనే స్మరించడం వంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వీటిని సాధారణంగా 108 సార్లు జపించడం శుభప్రదంగా భావిస్తారు. ఇందుకోసం 108 పూసలు కలిగిన జపమాలను ఉపయోగిస్తారు. సరైన ఉచ్చారణతో, ఏకాగ్రతతో మంత్రం పఠించినప్పుడు అది మన శరీరంలోని నరాలను ఉత్తేజితం చేసి సానుకూల ఫలితాలను ఇస్తుంది.

మన శరీరంలో 7 శక్తి కేంద్రాలుంటాయి. ఈ చక్రాల ద్వారానే ప్రాణశక్తి ప్రవహిస్తుంది. ఒక్కో చక్రానికి ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనం మంత్రాలను పఠించినప్పుడు వచ్చే ధ్వని తరంగాలు ఈ చక్రాల్లోని అడ్డంకులను తొలగించి, వాటిని సమతుల్యం చేస్తాయి. ఉదాహరణకు ‘ఓం’ కార నాదం శరీరంలోని అన్ని భాగాలపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఇలా మంత్ర పఠనం ద్వారా శారీరక ఆరోగ్యాన్ని, శక్తిని పొందవచ్చని నాద యోగం వివరిస్తుంది.

లలితా సహస్రనామ పారాయణం సకల కోరికలను నెరవేర్చే మహామంత్రం. అగస్త్యుడి కోరిక మేరకు హయగ్రీవుడు ఈ వెయ్యి నామాలను ఉపదేశించారు. ఈ స్తోత్రం 183 శ్లోకాల సమాహారం. దీనిని భక్తితో, ఉచ్చారణ దోషాలు లేకుండా పారాయణం చేస్తే అపమృత్యువు తొలగి, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. ‘ప్రతి నామం ఓ మంత్రం. అర్థం తెలుసుకుని చదివితే అఖండ ఫలితముంటుంది. సృష్టికి మూలమైన ఆ తల్లి అనుగ్రహం కోసం ఇది శ్రేష్ఠం’ అంటున్నారు పండితులు.

PolitEnt Media

PolitEnt Media

Next Story