Akshaya Tritiya: హిందూ ధర్మశాస్త్రం ప్రకారం సంవత్సరంలో వచ్చే అత్యంత శుభప్రదమైన రోజుల్లో అక్షయ తృతీయ ఒకటి. అక్షయ అంటేనే అంతం లేనిది అని అర్థం. ఈ రోజున ఏ పని మొదలుపెట్టినా, ఏ వస్తువు కొన్నా అది వృద్ధి చెందుతూనే ఉంటుందని భక్తుల నమ్మకం. ఈ ఏడాది అక్షయ తృతీయ తిథి, ముహూర్తం, విశిష్టత గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ముహూర్తం ఎప్పుడు?

ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 19 మరియు 20 తేదీల మధ్య వస్తోంది.

తిథి ప్రారంభం: ఏప్రిల్ 19 (ఆదివారం) మధ్యాహ్నం 1:01 గంటలకు.

తిథి ముగింపు: ఏప్రిల్ 20 (సోమవారం) ఉదయం 10:40 గంటలకు.

ముఖ్య గమనిక: ఏప్రిల్ 20న సూర్యోదయ తిథి ఉన్నప్పటికీ, ఏప్రిల్ 19నే ప్రధానంగా అక్షయ తృతీయ పర్వదినాన్ని జరుపుకోవడం విశేషం.

బంగారం కొనలేకపోతే ఇవి కొనండి

అక్షయ తృతీయ అనగానే అందరికీ గుర్తొచ్చేది బంగారం. అయితే, ప్రస్తుత ధరల దృష్ట్యా అందరూ బంగారం కొనడం సాధ్యం కాకపోవచ్చు. జ్యోతిష్య నిపుణుల ప్రకారం, అదృష్టం మరియు సంపద కోసం బంగారం మాత్రమే కాదు.. ఈ కింద పేర్కొన్న తక్కువ ఖరీదు వస్తువులను కొన్నా శుభ ఫలితాలు ఉంటాయి:

మట్టి పాత్రలు: వేసవిలో చల్లని నీటిని ఇచ్చే మట్టి పాత్రను కొనడం దైవకార్యంతో సమానం.

త్తిమీర గింజలు లేదా ఆకులు: ఇవి శ్రేయస్సుకు చిహ్నం.

బియ్యం, నెయ్యి: అన్నపూర్ణా దేవి అనుగ్రహం కోసం వీటిని కొనుగోలు చేయవచ్చు.

రాగి పాత్రలు, ఎర్రటి వస్త్రంః ఇవి ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతాయి.

చిన్న విగ్రహాలు లేదా దీపాలు: పూజ గది కోసం వీటిని తీసుకోవడం ఉత్తమం.

దానధర్మాలకు విశిష్ట సమయం

అక్షయ తృతీయ నాడు చేసే జపాలు, తపస్సులు, దానధర్మాల వల్ల కలిగే పుణ్యం ఎప్పటికీ తరగదు. ఈ రోజున పేదలకు అన్నదానం చేయడం, వస్త్ర దానం చేయడం వల్ల విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

కొత్త వ్యాపారాలకు శుభ సమయం

కొత్త ఇల్లు కొనాలన్నా, గృహప్రవేశం చేయాలన్నా లేదా కొత్త వ్యాపారం ప్రారంభించాలన్నా ఈ రోజు ఎంతో అనుకూలం. ఈ రోజు పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో స్థిరమైన వృద్ధిని మరియు ఆర్థిక లాభాలను తెచ్చిపెడతాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story