అనసార లీల

Anasara Leela: జగన్నాథుని లీలలు అపారమైనవి. ప్రతీ సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమినాడు ప్రత్యేకంగా జరిగే స్నాన యాత్ర అనంతరం, భగవంతుడు 15 రోజులు అనారోగ్యానికి గురవుతారు. ఈ అనంత విశ్రాంతిని అనసార లీల అంటారు.

అనసార లీల అంటే ఏమిటి?

ఈ సమయంలో ఆలయం తలుపులు మూసివేయబడతాయి. భగవంతుని భౌతిక రూపమైన శరీరం జ్వరంతో బాధపడుతూ విశ్రాంతి తీసుకుంటుందని భక్తుల నమ్మకం. ఈ సమయంలో దయిత్గన్ అనే ప్రత్యేక సేవకులు మాత్రమే సేవ చేస్తారు. దేవునికి ఆహారం ఇవ్వరు – ఆయుర్వేద మూలికలు మాత్రమే అందిస్తారు. వంటగది కూడా మూసివేస్తారు.

ఈ లీల వెనుక భక్తి కథ

భగవంతుని గాథలో ఓ భాగమైన ఈ అనసార లీల వెనుక ఉన్న కథ భక్తుడి ప్రేమను చాటే కథ. మాధవదాస్ అనే భక్తుడు జీవితాంతం భగవంతుని సేవలో ఉండే ప్రయత్నం చేశాడు. శారీరకంగా బలహీనుడైపోయిన తరువాత కూడా, ఆయన సేవ తీయనంటాడు. దాన్ని చూసిన జగన్నాథుడు తన భక్తుడిని సేవించేందుకు స్వయంగా వచ్చాడు. భక్తుడికి వచిన అనారోగ్యాన్ని స్వయంగా తనపై వేసుకున్నాడు. "నీ ప్రేమ ముందు నాకైనా మారాల్సిందే," అని జగన్నాథుడు అన్నాడు. అందుకే భగవంతుడు 15 రోజులు అనారోగ్యానికి గురవుతాడని నమ్ముతారు.

పూరి రాజు కల కథ

ఒక మరొక కథ ప్రకారం, పూరి రాజుకు కలలో భగవంతుడు దర్శనమిచ్చి తాను చల్లని నీటిలో స్నానం చేసి ఏకాంతంగా ఉండాలని కోరాడు. అలా 15 రోజుల విశ్రాంతి అనంతరం ఆయన తిరిగి భక్తుల దర్శనానికి సిద్ధమవుతాడు.

ఈ సమయంలో ఆలయం మూసివేస్తారు. ఆ తరువాతే జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. లక్షలాది మంది భక్తులు ఆయన దివ్య రథాన్ని చూడడానికి తరలివస్తారు.

జగన్నాథుని లీలలు – భక్తులకు జీవితం పాఠాలు.

అనారోగ్యం, విశ్రాంతి, సంరక్షణ – ఇవన్నీ భగవంతుడే మానవులకు ఇచ్చిన సందేశాలు.

PolitEnt Media

PolitEnt Media

Next Story