సృష్టించారు?

Universe: ఈ అనంతమైన విశ్వం ఎలా పుట్టింది? అసలు సృష్టి అంటే ఏమిటి? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఆధునిక సైన్స్ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం గురించి చెబితే.. మన హిందూ పురాణాలు, వేదాలు వేల ఏళ్ల క్రితమే సృష్టి క్రమాన్ని అత్యంత శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా వివరించాయి.
హిందూ తత్వశాస్త్రం ప్రకారం.. 'సృష్టి' అంటే శూన్యం నుండి ఏదో కొత్తగా పుట్టడం కాదు. ఉన్నదానినే వ్యక్తపరచడం. సృష్టి అనేది ఒక వృత్తం (Cycle) లాంటిది. దీనికి మొదలు లేదు, ముగింపు లేదు. సృష్టి, స్థితి, లయం.. అంటే పుట్టడం, పెరగడం, మళ్లీ మూలంలోకి కలిసిపోవడం. దీనినే మనం 'కల్పం' అంటాం. మహాప్రళయం తర్వాత అంతా శూన్యంగా మారినప్పుడు, మళ్లీ సృష్టి ప్రక్రియ మొదటి నుండి ప్రారంభమవుతుంది.
పురాణాల ప్రకారం.. ఈ సృష్టికి మూలకారకుడు ఆ నిరాకార, నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం. ఆ పరమాత్మ సంకల్పం వల్లే ప్రకృతి, పురుషుడు ఏర్పడ్డారు. సృష్టి కార్యాన్ని నడిపించడానికి త్రిమూర్తులు అవతరించారు.
బ్రహ్మ దేవుడు: ఈ విశ్వాన్ని, సమస్త జీవకోటిని నిర్మించిన సృష్టికర్త
మహా విష్ణువు: సృష్టిని క్రమపద్ధతిలో నడిపిస్తూ, కాపాడే 'స్థితికారుడు
మహా శివుడు: కాలం ముగిశాక విశ్వాన్ని మళ్లీ తనలోకి లీనం చేసుకునే లయకారుడు
నాసిదీయ సూక్తం ప్రకారం.. సృష్టికి ముందు చీకటి మాత్రమే ఉండేది. మహావిష్ణువు నాభి కమలం నుండి ఉద్భవించిన బ్రహ్మదేవుడు, తన తపోశక్తితో విశ్వంలోని పంచభూతాలను (నెల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం) సమకూర్చి, గ్రహాలు, నక్షత్రాలు, సమస్త జీవులను సృజించారు.
అద్భుతమైన విషయం ఏంటంటే.. హిందూ పురాణాల ప్రకారం దేవుడు విశ్వాన్ని ఎక్కడో దూరం నుండి సృష్టించలేదు. ఆయన తనలో నుంచే ఈ విశ్వాన్ని వ్యక్తపరిచాడు. అంటే, ఈ సృష్టిలోని ప్రతి అణువులోనూ, మీలో, నాలో.. ఆ పరమాత్మ అంశ దాగి ఉంది.అహంబ్రహ్మాస్మి అనే పరమార్థం ఇదే!
- Latest Telugu NewsCreationUniverseOrigin of the UniverseSpiritualityHindu PhilosophyVedic KnowledgeSanatana DharmaCosmologyDivine CreationGodCreatorReligious BeliefsSpiritual NewsHinduismIndian PhilosophyMythologyLife and CreationDevotional NewsTelugu NewsLatest UpdatesSpiritual KnowledgeUniverse FactsPhilosophy

