Devotional: ఏరువాక పౌర్ణమి అంటే ఏంటి? ఆ రోజు ఏం చేస్తారు
ఆ రోజు ఏం చేస్తారు

Devotional: కార్తీక పౌర్ణమి తరువాత అంతటి విశిష్టత జ్యేష్ఠ పౌర్ణమికి ఉంది. వర్షఋతువులో జ్యేష్ఠశుద్ధ పూర్ణిమను తెలుగు రైతులు ఏరువాక పున్నమిగా జరుపుకుంటారు. తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య అరక దున్నటంతో పొలం పనులు మొదలుపెడతారు. ఏరు అంటే దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అని, ఏరువాక అంటే దున్నడానికి ప్రారంభమనీ అర్థం. అంటే వ్యవసాయం మొదలుపెట్టడం. సాంప్రదాయికంగా రైతులు ఏరువాక పున్నమిని పండుగలా జరుపుకుంటారు. ఆ రోజు ఎద్దులను కడిగి చక్కగా అలంకరిస్తారు. వాటికి పొంగలి పెడుతారు. అనంతరం రైతులందరూ సామూహికంగా ఎద్దులను తోలుకుని పొలాలకు వెళ్లి దుక్కి దున్నుతారు.
ఆరోజున ఆడపడుచులు పుట్టింటికి వస్తారు. ఈ పండుగనాడు చేసే మరో ముఖ్యమైన వేడుక ఎడ్ల పందేలు. ఎద్దులను బాగా అలంకరించి పరిగెత్తిస్తారు. వాటి వెనుక యువకులు పరుగులు తీస్తారు. అంతేకాకుండా ఎద్దులకు బండలు (బరువైన రాళ్ళూ) కట్టి పరుగులు తీయిస్తారు. దీన్ని బండలాగుడు పోటీ అంటారు. జ్యేష్ఠ పూర్ణిమ రోజు జుట్టు గోళ్లను కత్తిరించకూడదు. పౌర్ణమి రోజున చంద్రుడు పూర్ణ చంద్రుడి రూపంలో కనిపిస్తాడు.మన పూర్వీకుల కాలం నుండి నేటి వరకు భూమిని భూదేవిగా కొలుస్తున్నాం. ఆరోజున జుట్టును.. గోళ్లను భూమిపై పడేస్తే అశుభమని పండితులు చెబుతున్నారు. జ్యేష్ఠ పూర్ణిమ రోజు సాత్వికమైన ఆహారాన్ని తినాలి. కుల దైవాన్ని భూమాతకు ప్రత్యేకంగా పూజలు జరపాలి. జూన్ 11 న ఏరువాక పౌర్ణమి వస్తుంది.
ఆ రోజు చేయకూడనివి
మాంసాహారానికి..మద్యానికి దూరంగా ఉండాలి
గోర్లు, జుట్టు కత్తిరించకూడదు
నలుపు రంగు దుస్తులు ధరించొద్దు
తులసి ఆకులను కోయవద్దు
