Shani Sade Sati: శని సాడే సాతి అంటే ఏమిటీ..? దాని ప్రభావాలు ఏమిటీ?
దాని ప్రభావాలు ఏమిటీ?

Shani Sade Sati: హిందూ జ్యోతిషశాస్త్రంలో తరచుగా భయపెట్టే కాలంగా పరిగణించబడే శని సాడే సతి గురించి ఇప్పటికే ఎంతో మంది పండితులు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇది ఏడున్నర సంవత్సరాల కాలం పాటు శని ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుందని.. ఈ కాలాన్ని సరిగా అర్థం చేసుకుంటే దీని భయం నుండి బయటపడవచ్చని చెబుతున్నారు.
శని సాడే సతి ఎలా లెక్కించాలి?
శని ఒక వ్యక్తి చంద్ర రాశికి ముందున్న 12వ ఇల్లు, చంద్ర రాశి, ఆ తర్వాత వచ్చే 2వ ఇంట్లో సంచరించే కాలాన్ని సాడే సతి అంటారు. శని ఒక్కో రాశిలో సుమారు రెండున్నర సంవత్సరాలు ఉంటాడు. ఈ మూడు దశలు కలిపితే మొత్తం ఏడున్నర సంవత్సరాలు అవుతుంది.
మొదటి దశ: శని చంద్ర రాశికి ముందున్న 12వ రాశిలోకి ప్రవేశించడంతో ప్రారంభమవుతుంది.
రెండో దశ: శని చంద్ర రాశిలోకి ప్రవేశించినప్పుడు మొదలవుతుంది.
మూడో దశ: శని చంద్ర రాశి నుండి తదుపరి 2వ రాశిలోకి ప్రవేశించడంతో మొదలవుతుంది.
సాడే సతి ప్రభావాలు:
సాధారణంగా, ఈ కాలం ఆర్థిక నష్టాలు, కెరీర్లో ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, కుటుంబంలో చిన్న చిన్న వివాదాలకు కారణమవుతుందని నమ్ముతారు. అయితే శని న్యాయానికి దేవుడు. ఈ కాలంలో కష్టపడి, నిజాయితీగా జీవించేవారికి శని మంచి ఫలితాలను ఇస్తాడు. ఈ కాలం స్వీయ-శుద్ధి, జీవిత పాఠాలను నేర్చుకోవడానికి ఒక అవకాశంగా భావించాలి.
శని సాడే సతి ప్రభావాలను తగ్గించుకోవడానికి పరిహారాలు:
శని సాడే సతి ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి కొన్ని జ్యోతిష్య పరిహారాలను ఆయన సూచించారు:
శనివారాల్లో ఉపవాసం ఉండటం.
శని దేవ మంత్రాలను జపించడం.
పేదలకు, నిరుపేదలకు సహాయం చేయడం.
శని దేవాలయాలను సందర్శించడం.
చివరగా శని సాడే సతి అనేది ఒక వ్యక్తిని మానసికంగా, ఆధ్యాత్మికంగా బలోపేతం చేసే ఒక సహజమైన జీవిత దశ అని పండితులు చెప్పారు. ఈ కాలాన్ని భయంతో కాకుండా తమను తాము మెరుగుపరుచుకోవడానికి ఒక అవకాశంగా చూడాలని ఆయన సూచించారు.
