16 Mondays Vratam: 16 సోమవారాల వ్రతం అంటే ఏంటి..ఎలా చేయాలి
ఎలా చేయాలి

16 Mondays Vratam: శివభక్తులు ఆచరించేది 16 సోమవారాల వ్రతం". అయితే, చాలామంది తమకున్న సమయం లేదా మొక్కుబడిని బట్టి 6 సోమవారాల వ్రతం కూడా చేస్తుంటారు. దీనిని ప్రధానంగా కార్తీక మాసంలో లేదా ఏదైనా ప్రత్యేక కోరిక నెరవేరాలని సంకల్పించుకున్నప్పుడు చేస్తారు.ఆధ్యాత్మిక గ్రంథాల్లో 16 సోమవారాల వ్రతానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. అయితే, భక్తితో 6 వారాలు చేసినా శివుడు అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం.
ఉదయాన్నే స్నానమాచరించాలి. శివలింగానికి గంగాజలం, పంచామృతాలతో అభిషేకం చేయాలి. పూజలో బిల్వపత్రాలు, తెల్లటి పుష్పాలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. వ్రత కథను చదివి రోజంతా ‘ఓం నమః శివాయ’, ‘మహామృత్యుంజయ’ మంత్రాన్ని జపించాలి. ఉపవాసం ఉండేవారు పాలు, పండ్లు తీసుకోవచ్చు. సాయంత్రం చంద్ర దర్శనం తర్వాత ఉపవాసం విరమించాలి. ఈ వ్రతం వల్ల మానసిక ప్రశాంతత, అన్యోన్య దాంపత్యం, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఈ వ్రతం ప్రధానంగా శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి చేస్తారు. కోరిన కోర్కెలు నెరవేరాలని, ముఖ్యంగా పెళ్లి సంబంధాల కోసం లేదా కుటుంబ సౌఖ్యం కోసం భక్తులు ఈ వ్రతాన్ని భక్తితో ఆచరిస్తారు.
వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలా? సంతాన సమస్యలా? అయితే ‘16 సోమవారాల వ్రతం’ చేయాలని పండితులు సూచిస్తున్నారు. ఫలితంగా సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నారు. కుటుంబ సౌఖ్యం, ఆర్థిక వృద్ధి, మనోవాంఛా సిద్ధి కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వరుసగా 16 వారాలు ఉపవాసం ఉంటూ శివపార్వతులను పూజిస్తారు. నిశ్చల భక్తితో వ్రతం పూర్తిచేసిన వారికి ఈశ్వరానుగ్రహం లభిస్తుందని నమ్మకం. వ్రత విధానం,
నియమాలు ఎలా ఉంటాయి?
ప్రారంభం: సాధారణంగా శ్రావణ మాసం లేదా కార్తీక మాసంలోని మొదటి సోమవారం ఈ వ్రతాన్ని మొదలుపెడతారు.
ఆహారం: రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం శివపూజ అనంతరం ఒక్క పూట మాత్రమే (ఉప్పు లేని ఆహారం లేదా పండ్లు) తీసుకుంటారు.
కథ: పూజ సమయంలో '16 సోమవారాల వ్రత కథ'ను చదవడం లేదా వినడం తప్పనిసరి.
ఉద్యాపన: 16 వారాలు పూర్తయిన తర్వాత 17వ సోమవారం నాడు ఉద్యాపన (ముగింపు పూజ) చేసి నలుగురికి ప్రసాదం పంచుతారు.

