ఎలాంటి నియమాలు పాటించాలి?

Ramakoti: శ్రీరామనామ స్మరణతో కోటిసార్లు 'శ్రీరామ' అని రాయడం (రామకోటి) అనేది అనాదిగా వస్తున్న ఒక పవిత్ర సంప్రదాయం. అయితే, ఈ ఆధ్యాత్మిక కార్యంలో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన ముఖ్య నియమాలను ధర్మ పండితులు ఈ విధంగా వెల్లడించారు:

​శుచి, పవిత్రత: రామకోటి రాయడానికి ఉపక్రమించేవారు తప్పనిసరిగా స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి.

ఏకాగ్రత, భక్తి: రాసేటప్పుడు కేవలం రామనామంపైనే మనస్సును కేంద్రీకరించాలి. ఇతర ఆలోచనలు, అనవసరపు మాటలు మాట్లాడకూడదు. బలవంతంగా కాకుండా, భక్తితో సంకల్పంతో మాత్రమే రాయాలి.

నేలపై కూర్చుని లేదా పడుకుని రాయకూడదు. కుదిరితే పద్మాసనం వేసుకుని లేదా శుభ్రమైన పీటపై కూర్చుని రాయాలి. సాధారణంగా తూర్పు దిశగా కూర్చుని రాయడం మంచిది

​రామకోటిని రాయడానికి ప్రత్యేకంగా ఒక కలం (పెన్ను) ను కేటాయించాలి. ఆ కలాన్ని ఇతర అవసరాలకు ఉపయోగించకూడదు. నల్ల రంగు పెన్నుతో రాయకూడదు. నీలం లేదా ఆకుపచ్చ రంగు సిరా ఉత్తమమని సూచించారు. రామకోటి పుస్తకంలో ఇతర విషయాలు ఏవీ రాయకూడదు.

​రాయడం మధ్యలో అనుకోకుండా ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్లవలసి వస్తే, సరి సంఖ్యలో నామాలను రాసి ఆపివేయడం ఉత్తమం. తిరిగి వచ్చి రాయడానికి ముందు కాళ్లు, చేతులు, ముఖం కడుక్కుని, దేవునికి నమస్కరించుకుని, మనస్సును రాముడిపై నిలిపి మళ్లీ ప్రారంభించాలి. మైల, అంటు, పురుడు వంటి సమయాల్లో రాయకూడదు.రామకోటి రాయడం ప్రారంభించే ముందు, మంచి సమయాన్ని ఎంచుకుని, పుస్తకానికి పసుపు, కుంకుమ రాసి, దేవుని సన్నిధిలో శ్రీరామ అష్టోత్తరశతనామావళితో పూజ చేయడం శుభకరం.

PolitEnt Media

PolitEnt Media

Next Story