ఏం వేయొద్దు

Bhogi Bonfire: సంక్రాంతి పండుగలో మొదటి రోజైన భోగి నాడు వేసే భోగి మంటలు కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, దీని వెనుక శాస్త్రీయ పర్యావరణ కారణాలు కూడా ఉన్నాయి. మన ఇంట్లోని పాత వస్తువులను, నెగటివ్ ఆలోచనలను వదిలేసి కొత్త వెలుగులోకి రావడమే దీని ఉద్దేశ్యం.

భోగి మంటల్లోఏమి వేయాలి?

సాంప్రదాయం ప్రకారం భోగి మంటల్లో పర్యావరణానికి హాని చేయని సహజ సిద్ధమైన వస్తువులను మాత్రమే వేయాలి.ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది. శాస్త్రీయంగా ఇది గాలిలోని క్రిములను చంపుతుంది. చెట్ల నుండి రాలిన ఎండు కొమ్మలు, ఆకులను వేయవచ్చు. ఇంట్లో విరిగిపోయిన, పనికిరాని చెక్క వస్తువులను (పెయింట్ లేనివి) వేయవచ్చు.పనికిరాని నూలు దుస్తులను వేయవచ్చు. ఇది పాతను విడనాడి కొత్తను ఆహ్వానించడానికి సంకేతం. హోమంలా భావించి కొన్ని ధాన్యాలు, నెయ్యి వేయడం వల్ల గాలి పరిమళభరితం అవుతుంది.

ఏమి వేయకూడదు?

ప్రస్తుత కాలంలో పాత సామాన్ల పేరుతో ప్లాస్టిక్ , విషపూరిత పదార్థాలను కాల్చడం వల్ల తీవ్రమైన వాయు కాలుష్యం ఏర్పడుతోంది. వీటిని పొరపాటున కూడా మంటల్లో వేయకండి.ప్లాస్టిక్ కవర్లు, డబ్బాలు, వైర్లు కాల్చడం వల్ల డైఆక్సిన్స్ వంటి ప్రమాదకర రసాయనాలు విడుదలవుతాయి. ఇవి క్యాన్సర్ కారకాలు. రబ్బరు కాల్చడం వల్ల వచ్చే దట్టమైన నల్లటి పొగ ఊపిరితిత్తులకు చాలా ప్రమాదకరం. పాలిస్టర్, నైలాన్ వంటి బట్టలను కాల్చకూడదు. అవి కరిగి చర్మానికి అంటుకుపోతాయి , విష వాయువులను వదులుతాయి. పెయింట్ వేసిన చెక్కలు లేదా రసాయన డబ్బాలు వేయడం వల్ల విస్ఫోటనాలు జరిగే అవకాశం ఉంది. పాత బ్యాటరీలు, రిమోట్లు, సెల్‌ఫోన్లు మంటల్లో వేయడం అత్యంత ప్రమాదకరం.

PolitEnt Media

PolitEnt Media

Next Story