Raksha Bandhan 2026: అన్నాచెల్లెళ్లు, తమ్ముళ్ల మధ్య ఉండే అప్యాయతకు, ప్రేమానురాగాలకు ప్రతీక రక్షా బంధన్ పండుగ. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఈ పవిత్ర వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. సోదరి తన అన్న చేతికి రాఖీ కట్టి, అతని ఆయురారోగ్యాల కోసం ప్రార్థిస్తే... సోదరుడు జీవితాంతం రక్షణగా నిలుస్తానని మాటిచ్చే అందమైన బంధం ఇది.

అయితే, ఈ ఏడాది (2026) రాఖీ పండుగ తేదీ విషయంలో కొందరిలో చిన్నపాటి సందేహాలు ఉన్నాయి. ఆగస్టు 27 లేదా 28 - ఏ రోజు జరుపుకోవాలి అనే దానిపై పంచాంగం ప్రకారం ఉదయ తిథిని ప్రాతిపదికగా తీసుకొని, ఆగస్టు 28వ తేదీన రక్షా బంధన్ జరుపుకోవాలని పండితులు స్పష్టం చేస్తున్నారు. ఇక రాఖీ కట్టడానికి ఉదయం 6:23 నుండి 9:48 వరకు అత్యంత అనువైన ముహూర్తం ఉంది. అలాగే మధ్యాహ్నం 12:14 నుండి 1:05 వరకు అభిజిత్ ముహూర్తంలో కూడా రాఖీ కట్టుకోవచ్చు. ఈ రోజే చంద్రగ్రహణం ఉన్నప్పటికీ, అది మన దేశంలో కనిపించదు కాబట్టి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.

ఈ పండుగ వెనుక ఎన్నో పౌరాణిక, చారిత్రక గాథలు ఉన్నాయి. ఒకసారి శ్రీకృష్ణుడి వేలికి గాయమై రక్తం వస్తుంటే, ద్రౌపది తన చీర కొంగును చింపి ఆయన వేలికి కట్టింది. ఆ ప్రేమకు మురిసిపోయిన కృష్ణుడు, ఆపదలో ఆమెను కాపాడుతానని మాటిచ్చాడు. అలాగే, మహావిష్ణువును వైకుంఠానికి తీసుకురావడానికి లక్ష్మీదేవి బాలి చక్రవర్తికి రాక్ష సూత్రం కట్టిందని పురాణాలు చెబుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story