Shiva Lingam Be Installed at Home: ఇంట్లో శివలింగాన్ని ఏ దిశలో ప్రతిష్ఠించాలి?
ఏ దిశలో ప్రతిష్ఠించాలి?

Shiva Lingam Be Installed at Home: శివపురాణం ప్రకారం.. లింగాన్ని పవిత్రమైన పూజా మందిరంలోనే స్థాపించాలని పండితులు సూచిస్తున్నారు. పూజించలేని, అశుభ్రమైన ప్రదేశాలలో లింగాన్ని ఉంచకూడదంటున్నారు. ‘శివలింగం ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉండాలి. అలాగే దాని బలిపీఠం (పానవట్టం) ముఖం ఎల్లప్పుడూ ఉత్తరం వైపుకే ఉండేలా ఏర్పాటు చేయాలి. ప్లాస్టిక్, POPలతో కాకుండా రాయి, మట్టి, లోహాలతో తయారుచేసిన శివలింగాలను పూజించాలి’ అని సూచిస్తున్నారు. ఎత్తైన శివలింగాన్ని ఇంట్లో ప్రతిష్ఠిస్తే కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలని పండితులు చెబుతున్నారు. లింగం నుంచి నిత్యం శక్తి విడుదలవుతూ ఉంటుంది. కాబట్టి పైనుంచి చిన్న నీటి ప్రవాహమైనా ఉండాలి. రోజూ సాత్విక నైవేద్యం పెట్టాలి. ఇంట్లో మాంసాహారం వండకూడదు. ఇంట్లో వారెవరూ మద్యమాంసాలు ముట్టుకోకూడదు. ఓ ఇంట్లో 2 లింగాలను ప్రతిష్ఠించకూడదు. శివలింగం ఉన్న పూజా మందిరం పవిత్రంగా, పరిశుభ్రంగా ఉండాలి. ప్రతిష్టించిన శివలింగంలో దైవశక్తి ఉంటుంది. నిత్యం పూజించడం ద్వారా ఆ శక్తిని, పవిత్రతను కాపాడుకోవచ్చు. శివలింగాన్ని కేవలం ఒక అలంకరణ వస్తువుగా కాకుండా, సాక్షాత్తు శివ స్వరూపంగా భావించాలి. అందుకే నిత్య పూజ, నైవేద్యం, అభిషేకం వంటి కనీస ఆచారాలు తప్పనిసరి.

