స్త్రీలు దేవాలయాలకు ఎందుకు వెళ్లకూడదు?

Menstruating Women: పురాణాల ప్రకారం, ఋతుమతి అయిన స్త్రీలు దేవాలయాలను సందర్శించడం, పూజా కార్యక్రమాలలో పాల్గొనడం నిషేధం. దీని వెనుక మతపరమైన, శాస్త్రీయ కారణాలు ఉన్నాయని చెబుతారు.

మతపరమైన కారణాలు

హిందూ ధర్మం ప్రకారం, ఋతుస్రావం అనేది ఒక మహిళ శరీరంలోని అపవిత్రమైన రక్తం బయటకు వెళ్ళే ప్రక్రియ. ఈ సమయంలో మహిళలు శుచిగా ఉండరని, అందుకే పవిత్రమైన దేవాలయాల్లోకి ప్రవేశించకూడదని భావిస్తారు. అలాగే, దేవాలయాలలోని దైవిక శక్తిని, పవిత్రతను కాపాడటానికి కూడా ఈ నియమాన్ని పాటించాలని నమ్ముతారు.

శాస్త్రీయ కారణాలు

శరీర ధర్మం: ఋతుస్రావం సమయంలో స్త్రీ శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు జరుగుతాయి. ఈ సమయంలో వారికి అలసట, బలహీనత ఎక్కువగా ఉంటాయి. దేవాలయాలను సందర్శించడం, పూజలు చేయడం అనేది శారీరకంగా, మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. ఈ కారణంగా, వారికి విశ్రాంతి ఇవ్వడం కోసమే ఈ నియమాన్ని ఏర్పరిచారని చెబుతారు.

పారిశుద్ధ్యం: పూర్వకాలంలో పరిశుభ్రత సౌకర్యాలు సరిగా ఉండేవి కావు. ఈ కారణంగా ఋతుస్రావం సమయంలో దేవాలయాల్లోని పవిత్ర వాతావరణం కలుషితం కాకుండా ఉండటానికి ఈ నియమాన్ని పాటించేవారు.

ఆధునిక అభిప్రాయాలు

ఈ నియమాలపై ఆధునిక సమాజంలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు మహిళలు ఈ నియమాన్ని పాటించకూడదని వాదిస్తున్నారు. ఋతుస్రావం అనేది సహజమైన శారీరక ప్రక్రియ. ఇందులో అపవిత్రత ఏమీ లేదని, దీని వల్ల దేవాలయాలకు ఎలాంటి హాని ఉండదని కొందరు వాదిస్తున్నారు.

ఆధునిక వైద్యశాస్త్రం ప్రకారం, ఋతుస్రావం అనేది స్త్రీ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ఇది ప్రకృతి నియమం. దీనిని అపవిత్రంగా చూడకూడదని చెబుతున్నారు. శబరిమల ఆలయంలో 10-50 సంవత్సరాల వయస్సు మహిళలను గతంలో ప్రవేశం నిషేధించారు. ఈ విషయంపై కోర్టులో వివాదం జరిగి, సుప్రీంకోర్టు మహిళల ప్రవేశానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనితో ఈ నిబంధనల పట్ల ఆధునిక దృక్పధాన్ని ఇది సూచిస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story