Close Our Eyes While Chanting Mantras: సనాతన ధర్మంలో పూజలు, ధ్యానం లేదా మంత్రోచ్ఛారణ చేసేటప్పుడు కళ్ళు మూసుకోవడం ఒక సాధారణ ఆచారం. అయితే ఇది కేవలం భక్తితో ముడిపడిన సంప్రదాయం మాత్రమే కాదు.. దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక రహస్యం, శాస్త్రీయ దృక్పథం కూడా దాగి ఉన్నాయని మన ప్రాచీన గ్రంథాలు, ఆధ్యాత్మిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు.

బాహ్య ప్రపంచం నుంచి అంతర్ముఖం వైపు ప్రయాణం

మానవ శరీరంలో అత్యధిక శాతం సమాచారాన్ని మెదడుకు చేరవేసేది కళ్ళే. కళ్ళు తెరిచి ఉన్నంతసేపు మనస్సు బాహ్య ప్రపంచంలోని రంగులు, దృశ్యాలు, ఆలోచనల ద్వారా నిరంతరం చెల్లాచెదురవుతూ ఉంటుంది. మంత్రోచ్ఛారణ సమయంలో కళ్ళు మూసుకోవడం ద్వారా:

దృష్టి నిలకడ: బాహ్య ప్రపంచం నుండి దృష్టి మళ్ళి అంతర్ముఖం వైపు మళ్ళుతుంది.

ఏకాగ్రత: మంత్రంలోని ప్రతి అక్షరం, ధ్వనిపై పూర్తి ఏకాగ్రత కుదురుతుంది.

ఆజ్ఞా చక్ర ప్రేరణ: రెండు కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞా చక్రం వైపు మనస్సు కేంద్రీకృతమై ధ్యానావస్థ వేగంగా సిద్ధిస్తుంది.

ధ్వని తరంగాలు – శక్తి కేంద్రాల మేల్కొలుపు

సనాతన సంప్రదాయంలో మంత్రం అంటే కేవలం కొన్ని పదాల సముదాయం కాదు; అది ఒక నిర్దిష్టమైన శబ్ద తరంగం.

కళ్ళు మూసుకుని మంత్రోచ్ఛారణ చేసినప్పుడు ఉద్భవించే ప్రకంపనలు శరీరం లోపల ఉన్న నాడీ వ్యవస్థను, చక్రాలను ప్రభావితం చేస్తాయి. చూపు బయటకు వెళ్లకుండా అంతర్గతంగా శక్తి నిక్షిప్తమైనప్పుడు, ఆ ధ్వని తరంగాలు మనోఫలకంపై సానుకూల శక్తిని ప్రసరింపజేస్తాయి.

శాస్త్రీయ ప్రయోజనాలు

ఆధ్యాత్మిక భావనలతో పాటు దీనికి శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి.

ఒత్తిడి నివారణ: కళ్ళు మూసుకుని లయబద్ధంగా మంత్రం లేదా శ్వాసపై దృష్టి పెట్టినప్పుడు మెదడులో ఆల్ఫా తరంగాలు విడుదలై మానసిక ప్రశాంతత లభిస్తుంది.

నాడీ వ్యవస్థ శాంతించడం:

నిరంతరం ఆలోచనలతో అలసిపోయిన నాడీ వ్యవస్థ ప్రశాంతపడి రక్తపోటు అదుపులోకి వస్తుంది.

Next Story