దీని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటో తెలుసా?

Lamp Lit During Auspicious Rituals: హిందూ సంప్రదాయంలో ఏదైనా శుభ కార్యం, ప్రారంభోత్సవం లేదా పూజ ప్రారంభించే ముందు దీపం వెలిగించడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. ఇది కేవలం వెలుగు కోసం మాత్రమే కాదు, దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక అర్థం, జ్ఞానం, శ్రేయస్సు దాగి ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు వివరించారు.

దీపం - పరబ్రహ్మ స్వరూపం

"దీపం జ్యోతి పరబ్రహ్మ" అనే శ్లోకాన్ని ఉటంకిస్తూ.. దీపం వెలుగును పరబ్రహ్మ స్వరూపంగా, పాపాలను తొలగించే శక్తిగా అభివర్ణించారు. ఏదైనా నివేదనను అగ్ని ద్వారా దేవుడికి అర్పించినట్లే, దీపం ద్వారా భగవంతుని ప్రార్థిస్తాం. దీపం వెలిగించడం వల్ల మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి, సానుకూల ఆలోచనలు కలుగుతాయి.

పురోగతికి సంకేతం

దీపపు జ్వాల ఎల్లప్పుడూ పైకే మండుతుంది. ఈ ఊర్ధ్వ ముఖ కదలిక అనేది మానవుని అభివృద్ధికి, పురోగతికి మరియు శ్రేయస్సుకు చిహ్నం. అందుకే మన కార్యక్రమాలన్నీ దీప ప్రజ్వలనతోనే ప్రారంభమవుతాయి. ఇది అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే కాంతిని ప్రసాదించే గురువుకు కూడా సంకేతం.

పంచభూతాల్లో అగ్ని పాత్ర

పంచభూతాలలో ఒకటైన అగ్నిదేవుడు సూర్యునికి చిహ్నం. ఏదైనా కార్యక్రమం ప్రారంభంలో దీపం వెలిగించడం అంటే.. అగ్నిదేవుడిని సాక్షిగా ఉంచి, ఆయన అనుగ్రహం కోరుతూ ఆ పనిని విజయవంతం చేయమని ప్రార్థించడం. వ్యాపార సంస్థల్లో లేదా దుకాణాల్లో దీపం వెలిగించడం వల్ల ఎనిమిది దిక్కుల నుండి సానుకూల శక్తులు ఆకర్షించబడతాయి.

రైతులకు సూచన

కేవలం గృహాల్లోనే కాకుండా, రైతులు కూడా పొలంలో విత్తనాలు విత్తే ముందు భూమిలో రెండు దీపాలు వెలిగించి ప్రార్థించాలని పండితులు సలహా ఇచ్చారు. ఇలా చేయడం వల్ల ప్రకృతి అనుగ్రహం లభించి మంచి పంటలు పండుతాయని ఆయన పేర్కొన్నారు.

దీపం మనకు కేవలం వెలుగునివ్వడమే కాదు, అది మనలో ఆధ్యాత్మిక బలాన్ని నింపుతుంది. దీపం వెలిగించిన చోట అష్టదిక్కుల నుండి శుభం కలుగుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story