Guru Purnima: గురు పౌర్ణమికి ఎందుకంత విశిష్టత..ఆ రోజు ఏం చేయాలి.?
ఆ రోజు ఏం చేయాలి.?

Guru Purnima: గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.గురువుల పట్ల ఇదే గౌరవం అన్నివేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాసమహాముని పుట్టిన రోజు కాబట్టి ఈ రోజుకంత ప్రాధాన్యత ఉంది. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం గురుపౌర్ణమి జూలై 10న వచ్చింది. ఈరోజున కొంత మంది ఉపవాసం కూడా పాటిస్తారు. హిందూ మతంలో గురువును భగవంతునికి, భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తారు.
వ్యాస పీఠాన్ని ఏర్పాటు చేసుకొని వ్యాసుడితో పాటు... విష్ణుమూర్తి .. లక్ష్మీదేవి చిత్రపటాలకు .. పండ్లు, పువ్వులు, కుంకుమ, పసుపు మొదలైన పూజా సామగ్రితో పూజించండి.
గురు పౌర్ణమి రోజున పసుపు ధాన్యాలు, పసుపు వస్త్రాలు, పసుపు రంగు స్వీట్స్ దానం ఇవ్వండి. ఇది జాతకంలో గురు గ్రహాన్ని బలపరుస్తుంది.
గురు పౌర్ణమి రోజున గురువును, విష్ణువును పూజించిన వారు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.
గురువుగారి పాదాలకు పూజ చేయండి.
విష్ణువును పూజించేటప్పుడు, తులసి ఆకులు సమర్పించడం మర్చిపోవద్దు
గురు పౌర్ణమి రోజున గీతను పారాయణం చేయాలి... గోమాతకు సేవ చేయాలి.
ఆవునెయ్యితో దీపారాధన చేయండి.
