దాని ప్రాముఖ్యత ఏమిటి?

Rohini Nakshatra: హిందూ జ్యోతిషశాస్త్రంలో 27 నక్షత్రాలు ఉన్నాయి. వాటిలో రోహిణి నక్షత్రం అత్యంత శుభప్రదమైనదిగా, శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా మతపరమైన ఆచారాలు, పూజలకు ఇది చాలా అనుకూలమైనదిగా భావిస్తారు. రోహిణి నక్షత్రానికి ఉన్న ప్రాముఖ్యతకు అనేక పౌరాణిక, జ్యోతిషశాస్త్ర కారణాలు ఉన్నాయి.

పౌరాణిక ప్రాముఖ్యత: శ్రీకృష్ణుడితో సంబంధం

రోహిణి నక్షత్రానికి ఉన్న అత్యంత ముఖ్యమైన ప్రాముఖ్యత శ్రీకృష్ణుడి జననంతో ముడిపడి ఉంది. హిందూ గ్రంథాల ప్రకారం.. విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు ఈ నక్షత్రంలో జన్మించాడు. ఈ కారణంగా రోహిణి నక్షత్రం ప్రేమ, అందం, మాతృత్వానికి చిహ్నంగా చెబుతారు. అందుకే కృష్ణ జన్మాష్టమి సమయంలో ఈ నక్షత్రం వచ్చినప్పుడు పూజ, ఉపవాసం యొక్క ప్రాముఖ్యత అనేక రెట్లు పెరుగుతుంది.

జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యత

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. రోహిణి నక్షత్రం వృషభ రాశి కిందకు వస్తుంది. దీనికి పాలక గ్రహం చంద్రుడు. చంద్రుడు మనస్సు, భావోద్వేగాలు, మాతృత్వానికి కారకుడు. చంద్రుడు రోహిణి నక్షత్రంలో ఉన్నప్పుడు అతని సానుకూల శక్తి గరిష్ట స్థాయిలో ఉంటుంది. ఈ సమయంలో చేసే అన్ని మతపరమైన కార్యక్రమాలు, పూజలు త్వరగా ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు. అంతేకాకుండా రోహిణి నక్షత్రం స్థిరమైన, ధృఢమైన స్వభావం కలిగి ఉంటుంది. అందువల్ల, ఈ నక్షత్రంలో ప్రారంభించిన ఏ పనైనా దీర్ఘకాలం ఉంటుంది, విజయవంతమవుతుందని భావిస్తారు.

శుభ కార్యాలకు అనుకూలం

వివాహం, గృహప్రవేశం వంటి ముఖ్యమైన పనులకు రోహిణి నక్షత్రం అత్యంత శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ఈ నక్షత్రంలో జరిగే వివాహం జీవితాంతం ఆనందం, శ్రేయస్సును తెస్తుందని నమ్మకం. ఈ నక్షత్రంలో చేసే మతపరమైన ఆచారాలు, పూజల ఫలితాలు అనేక రెట్లు పెరుగుతాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story