ఎందుకు నోచుకుంటారు?

Maredo Dala Nomu: కుటుంబంలో సంతోషం, అఖండ సౌభాగ్యం లభించాలని మహిళలు ఈ నోము నోచుకుంటారు. శివునికి ఎంతో ఇష్టమైన మారేడు దళాలతో శివలింగాన్ని పూజిస్తారు. ఈ పూజ చేయడం వల్ల జాతకంలోని దోషాలు తొలగిపోతాయని నమ్మకం. ఆపదలో ఉన్నవారికి ప్రాణాపాయం తప్పించడానికి, కష్టాల్లో ఉన్నవారికి ఉపశమనం కలిగించడానికి ఈ నోము పనిచేస్తుంది. కాళీమాత ఉపదేశించిన ఈ నోమును ఆచరిస్తే అకాల మరణ గండాలు తొలగి, దీర్ఘ సుమంగళి ప్రాప్తం కలుగుతుందట.

సోమవారం/మాస శివరాత్రి/ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజుల్లో గణేషుడి వద్ద సంకల్పం తీసుకొని మొదలుపెట్టాలి. ఏడాది పాటు రోజూ 3 మారేడు ఆకులను, దోసెడు బియ్యాన్ని తీసుకుని శివుడిని భక్తితో పూజించాలి. ఏడాది ముగిసాక ఉద్యాపన నిర్వహించాలి. ఉద్యాపనలో బంగారు మారేడు దళం, వెండి మారేడు దళం, సహజమైన మారేడు దళాన్ని ఉంచి, మూడు దోసిళ్ల బియ్యంతో శివుడిని ఆరాధించాలి. అనంతరం పేదలకు అన్నదానం చేయడం ద్వారా ఈ నోము సంపూర్ణమవుతుంది.

సోమవారం ఉపవాసం ఉంటే మానసిక ప్రశాంతత, స్వీయ నియంత్రణ లభిస్తాయి. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పార్వతీదేవి కూడా ఈ ఉపవాసాన్ని ఆచరించిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున భక్తులు శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. అనంతరం మారేడు దళాలు, తుమ్మి పూలతో పూజించి ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని జపించాలి. రోజంతా భక్తితో గడిపి, సాయంత్రం సాత్విక ఆహారం తీసుకుంటే కోరికలు నెరవేరి, జీవితంలో సుఖశాంతులు చేకూరుతాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story