Perform Pradakshina in a Temple: ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడి చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు ఎలాగైతే తిరుగుతాయో, అలాగే గొప్ప శక్తి కేంద్రమైన దైవం చుట్టూ భక్తులు ప్రదక్షిణాలు చేస్తారు. దేవాలయాల్లో విగ్రహాల కింద ప్రతిష్టించే శక్తివంతమైన యంత్రాల ద్వారా వెలువడే సానుకూల శక్తిని ప్రదక్షిణల ద్వారా భక్తులు గ్రహించవచ్చని పండితులు చెబుతున్నారు.

ప్రదక్షిణలు చేసే విధానం

తూర్పు వైపు నిలబడి పడమర వైపు ఉన్న దైవాన్ని తూర్పు ముఖంగా వీక్షిస్తూ, ఎడమ చేతి వైపు నుంచి (తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యం మీదుగా) నడక ప్రారంభించాలి. చేయవలసిన ప్రదక్షిణల సంఖ్య:

సాధారణంగా ఏ ఆలయంలోనైనా కనీసం 3 ప్రదక్షిణలు చేయాలి. ఇవి సత్వ, రజస్, తమో గుణాలకు గత, వర్తమాన, భవిష్యత్ జన్మలకు ప్రతీకగా భావిస్తారు.

నవగ్రహ మంటపానికి: 9 ప్రదక్షిణలు

రావి చెట్టు - వేపు చెట్టు కలిసి ఉన్న ప్రదేశంలో27 ప్రదక్షిణలు

జమ్మి చెట్టుకు: 108 ప్రదక్షిణలు చేయాలి

పాటించవలసిన నియమాలు

ప్రదక్షిణ చేసే సమయంలో పూర్తిగా మౌనంగా ఉండాలి, నెమ్మదిగా నడవాలి తప్ప పరిగెత్తకూడదు లేదా పక్కచూపులు చూడకూడదు. తలవంచుకుని పాదాల మీద మాత్రమే దృష్టి పెట్టాలి. మనసులో ఇష్ట దైవ మంత్రాన్ని జపిస్తూ, చేతుల్లో జపమాల లేదా పూలు పట్టుకోవాలి; లేదంటే రెండు చేతులు జోడించి నడవాలి. దీన్ని వాకింగ్‌లా వేగంగా, పెద్ద అడుగులు వేస్తూ చేయకూడదని, ఎంతో భక్తిభావంతో అడుగులో అడుగు వేస్తూ నెమ్మదిగా సాగాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి

PolitEnt Media

PolitEnt Media

Next Story